ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు మాయం

ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు మాయం

  • ఉన్నతస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులకు

బీఆర్ఎస్ నేతల ఫిర్యాదులు మల్లాపూర్ మండలం జగిత్యాల జిల్లా...మల్లాపూర్ మండ పరిషత్ కార్యాల యంలో లబ్దిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ప్రొసీండింగ్లు మాయ మైన సంఘటన స్థాని కంగా చర్చనీయాంశంగా మారింది. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఆయా గ్రామాల సర్పంచులు, అధికారుల సమక్షంలో పత్రాలు అందజేశారు. ఇదిలా ఉండగా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కోటాలో మండలంలోని రాఘవపేట గ్రామానికి చెందిన 17 మందికి మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్లను కార్యాలయం నుంచి గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకెళ్లారు. కార్యాలయం నుంచి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు మాయమైన కొద్ది గంటల్లోనే రాఘ వపేట గ్రామంలో కొందరు కాంగ్రెస్ నేతలు సంబంధిత లబ్ధిదారులకు పంపిణీ చేసి సోషల్మీడియాలో పోస్టులు పెట్టడం విశేషం. ఈ అంశంపై బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు, సర్పంచ్ తోట శ్రీనివాస్ ఎంపీడీవో శ్రీకాంత్ దృష్టికి తీసుకెళ్లగా సంబంధిత శాఖాధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ సంఘటన జరిగిందని, బాద్యులైన వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

Views: 7

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న
మక్తల్ :  నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో స్థానిక పడమటి ఆంజనేయస్వామి దేవాలయ ఆవరణలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ( వాసవి క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షులు...
గ్రామపంచాయతీ ఉద్యోగుల సమస్యలపై ఐ ఎన్ టి యు సి తో కీలక చర్చలు
విజన్ ఆంధ్ర స్పాట్ న్యూస్‌కు స్పందన.. ఆత్మకూర్ వాగులో పోలీసుల మెరుపు దాడులు!
సర్వే చేసింది ఎవరు.. జాబితా మార్చింది ఎవరు. ?
మైసమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవానికి మాజీ ఎమ్మెల్యేకు ఆహ్వానం
బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గా రూపిరెడ్డి ఆదిరెడ్డి.....
మాల మహానాడు సిద్దిపేట జిల్లా వర్కింగ్ అధ్యక్షుడుగా చింతల విజయ్ నియామకం.