చెన్నాడీ మార్తాండ రావు ట్రస్ట్ వారిచే 65 ఇంచుల సామ్సంగ్ స్మార్ట్ టీవీ అందజేత: కోరెం.
బోయినపల్లి : బోయినపల్లి మండలం, కోరెం గ్రామంలో సోమవారం రోజు న ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు డిజిటల్ విద్యాబోధనలో భాగంగా చెన్నాడి మార్తాండ రావు ట్రస్ట్ వారిచే బహుకరించిన 65 ఇంచుల సామ్సంగ్ స్మార్ట్ టీవీని (రూ.88000) విలువ గల ది,చెన్నాడి సుధాకర్ రావు గారు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గారు ,ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ , మండల విద్యాధికారి, బోయిన్పల్లి కాంప్లెక్స్ హెడ్మాస్టర్ ,కోరెం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, వాలంటీర్లు , గ్రామ పెద్దలు, మరియు విద్యార్థులు వారి తల్లిదండ్రులు అందరూ పాల్గొన్నారు . ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సుధాకర్ రావు గారు మాట్లాడుతూ.. గ్రామ విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించడంలో తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారికి పేరుపేరునా కోరెం ప్రాథమి క పాఠశాల వారి, ధన్యవాదాలు,
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


