ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలం హ‌స్నాపూర్ ద‌స‌రా వేడుక‌ల‌లో కంది శ్రీ‌నివాస రెడ్డి దంప‌తులు

కుటుంబ స‌భ్యులు, గ్రామ‌స్తుల‌తో  క‌లిసి సంద‌డి 

ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలం హ‌స్నాపూర్ ద‌స‌రా వేడుక‌ల‌లో కంది శ్రీ‌నివాస రెడ్డి దంప‌తులు

ఆదిలాబాద్ బ్యూరో అక్టోబర్ 21 (విజన్ ఆంధ్ర)విజ‌య‌ద‌శ‌మి పండ‌గ‌ను పుర‌స్క‌రించుకొని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీ‌నివాస రెడ్డి త‌న సతీమ‌ణి కంది మౌనా శ్రీ‌నివాస రెడ్డి తో క‌లిసి స్వ‌గ్రామం తాంసీ మండలం హ‌స్నాపూర్ గ్రామాన్ని సంద‌ర్శించారు. త‌న నివాసంలో త‌ల్లిదండ్రులు కంది అన‌సూయా కిష్టారెడ్డి ల‌కు శ‌మీ ప‌త్రి అంద‌చేసి పాదాభివంద‌నం చేసి ఆశీస్సులు  అందుకున్నారు. అనంత‌రం కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి గ్రామంలోని శార‌దాదేవి మండ‌పాల‌ను సంద‌ర్శించి అమ్మ‌వార్ల‌ను ద‌ర్శించి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు . మండ‌పాల ఆవ‌ర‌ణ‌లో నిర్వ‌హించిన బ‌తుక‌మ్మ వేడుక‌ల‌లో పాల్గొన్నారు. గ్రామ‌స్తుల‌తో క‌లిసి కంది శ్రీ‌నివాస రెడ్డి కుటుంబ స‌భ్యులంతా బ‌తుక‌మ్మ‌ల చుట్టూ ఉత్సాహంగా  బ‌తుకమ్మ పాట‌ల‌కు అనుగుణంగా నృత్యాలు చేసారు. హ‌స్నాపూర్ గ్రామ‌స్తులంద‌రికి పండ‌గ శుభాకాంక్ష‌లు తెలిపారు. అనంత‌రం గ్రామ‌స్తులు బంగారం శ‌మీ ప‌త్రి అంద‌చేసి కంది శ్రీ‌నివాస రెడ్డి కుటుంబ సభ్యుల‌కు ద‌స‌రా శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో కంది శ్రీ‌నివాస రెడ్డి కుటుంబ స‌భ్యుల‌తో పాటు గ్రామ‌స్తులు పాల్గొన్నారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి.. చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి..
ఊరుకొండ : నాటినుండి నేటి వరకు నీతి నిజాయితీ, న్యాయం ధర్మం ఎన్నటికైనా విజయాన్ని సాధిస్తాయని గుర్తుచేసే.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పర్వదినాన్ని...
విధి నిర్వహణలో పోలీసుల త్యాగాలు చిరస్మరణీయం
పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి
పోలీసు అమరవీరుల త్యాగం మరువలేనిది
నేడు పత్తి కొనుగోళ్లు ప్రారంభం... కలెక్టర్ రాజర్షి షా 
పుల్లారెడ్డి స్వీట్ హౌస్ అధినేత మృతదేహానికి నివాళులర్పించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
నల్లగొండలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం: