గుంతలమయంగా మారిన పలుగుతండా - కొండాపూర్ రహదారి ‎

వాగు బ్రిడ్జి రోడ్డు మరమ్మతులకు నోచుకోక ప్రయాణికుల అవస్థలు ‎ ‎- నిర్లక్ష్యం వీడి వెంటనే రోడ్డును బాగు చేయాలని ప్రజల డిమాండ్ ‎

గుంతలమయంగా మారిన పలుగుతండా - కొండాపూర్ రహదారి ‎

కోయిలకొండ :  ‎కోయిలకొండ మండలం పలుగుతండా నుండి కొండాపూర్ వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా తయారైంది. ముఖ్యంగా మార్గమధ్యలోని వాగు బ్రిడ్జి రోడ్డు పూర్తిగా దెబ్బతిని, బీటీ రోడ్డు అంతా పెద్దపెద్ద గుంతలమయంగా మారింది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు సాగించే ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ‎రోడ్డు ఏమాత్రం కనిపిచకపోవడంతో ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా రాత్రివేళల్లో ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి కిందపడి గాయాలపాలవుతున్న ఘటనలు తరచూ జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.​సంబంధిత ఆర్ అండ్ బి (R&B) అధికారులు ఇప్పటికైనా తమ నిర్లక్ష్యాన్ని వీడి, తక్షణమే స్పందించి దెబ్బతిన్న రోడ్డుకు, వాగు బ్రిడ్జికి మరమ్మతులు చేపట్టి ప్రయాణికుల ప్రాణాలను కాపాడాలని ఈ ప్రాంత ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

జిల్లాస్థాయి క్రీడోత్సవాల్లో ఎడ్లపల్లి ఆదర్శ పాఠశాల విద్యార్థుల ప్రతిభ జిల్లాస్థాయి క్రీడోత్సవాల్లో ఎడ్లపల్లి ఆదర్శ పాఠశాల విద్యార్థుల ప్రతిభ
మల్హర్ :  జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన పీఎం శ్రీ పాఠశాలల జిల్లాస్థాయి క్రీడోత్సవాలు-2026లో మల్హర్ మండలంలోని ఎడ్లపల్లి ఆదర్శ పాఠశాల విద్యార్థినీ,...
70వ ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి పాఠశాలల అథ్లెటిక్స్ పోటీలలో హుస్నాబాద్ విద్యార్థికి ప్రథమ స్థానం
ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు
పోలీస్ స్టేషన్ పనితీరుపై విద్యార్థులకుఅవగాహన
షీ టీమ్స్ నిఘా.. 75 మందికి కౌన్సెలింగ్
ఘనంగా మాజీ ప్రధాని వర్ధంతి వేడుకలు
న్యాయ సహాయంతో సంక్షేమ పథకాలు అందరికీ అందాలి: డి. ఇందిరా ‎