ఎల్నినో ప్రభావం.. రైతుల కు ప్రత్యేక కరువు సహాయం అందించాలి !
బాన్సువాడ నియోజకవర్గాన్ని కరువు ప్రభావిత ప్రాంతంగా గుర్తించాలి...... పంట నష్టాలు, తాగునీటి సమస్యలపై ముందస్తు చర్యలు తీసుకోవాలి....... జిల్లా కలెక్టర్ కు బాన్సువాడ నియోజకవర్గ రైతుల ప్రజాప్రతినిధుల వినతి.....
బాన్సువాడ : ఎల్ ని నో ప్రభావం రైతులకు ప్రత్యేక కరువు సహాయం అందించాలని శనివారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ కు బాన్సువాడ రైతులు ప్రజాప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు.ఎల్నినో ప్రభావం తో రానున్న రోజుల్లో వర్షాభావ పరిస్థితులు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉన్న నేపథ్యం లో బాన్సువాడ నియోజకవర్గ రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని బాన్సువాడ నియోజకవర్గ రైతుల ప్రతినిధులు కోరారు. వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాలు తగ్గి పోవడం, సాగునీటి కొరత, పంటల దిగుబడులు తగ్గే ప్రమాదం, పశువులకు మేత తాగునీటి సమస్యల ను దృష్టి లో ఉంచుకొని ముందస్తు కరువు నివారణ చర్యలు చేపట్టాలని కోరుతూ కామారెడ్డి జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుతం వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావం కారణంగా వర్షపాతం తగ్గే అవకాశాలు ఉండటం తో రైతులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో భూగర్భ జలాలు తగ్గిపోవడం, బోర్లు, బావుల్లో నీటి లభ్యత తగ్గడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయని తెలిపారు. సాగునీటి కొరత ఏర్పడితే రైతులు సాగు చేసిన పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
బాన్సువాడ నియోజకవర్గం లోని బాన్సువాడ, వర్ని, రుద్రూర్, చందూర్, కోటగిరి, నసురుల్లాబాద్, బీర్కూర్ తదితర మండలాల్లో రైతుల పరిస్థితిని ప్రత్యేకం గా పరిశీలించి కరువు నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. వర్షాధార పంటల పై ఆధారపడిన రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగు పై వ్యవసాయ శాఖ ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు.
వినతిపత్రంలో ప్రధానంగా చేసిన డిమాండ్లు.....
బాన్సువాడ నియోజకవర్గం లోని కరువు ప్రభావిత ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక కరువు నివారణ చర్యలు చేపట్టాలి అని సూచించారు. ఎల్నినో ప్రభావం పై రైతులకు ముందస్తు సమాచారం అందించి, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగుపై అవగాహన కల్పించాలి. సాగునీటి లభ్యత, భూగర్భ జలాల పరిస్థితిపై సమగ్ర సర్వే నిర్వహించి వాస్తవ పరిస్థితుల ను వెల్లడించాలి. తక్కువ నీటి తో పండించే ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించి రైతుల కు అవసరమైన శిక్షణ ఇవ్వాలి. బోర్లు, బావులు, చెరువుల్లో నీటి లభ్యతను అంచనా వేసి పంటల సాగుకు ముందస్తు ప్రణాళిక రూపొందించాలి. రైతుల కు విత్తనాలు, ఎరువులు, సూక్ష్మ సేద్యం వంటి వ్యవసాయ అవసరాల పై తగిన అవగాహన తో పాటు ప్రభుత్వ సహకారం అందించాలి. గ్రామ స్థాయి లో వర్షాభావ పరిస్థితుల పై రైతుల కు ముందు గానే సమాచారం అందించే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. పంటల బీమా, ప్రభుత్వ సహాయ పథకాలపై రైతులకు పూర్తి సమాచారం అందించి అర్హుల కు ప్రయోజనం చేకూర్చాలి అని తెలిపారు. ప్రతి మండలం లో వ్యవసాయ శాఖ అధికారుల తో ప్రత్యేక బృందాల ను ఏర్పాటు చేసి రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి.
పంటలు దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారం అందించేలా ముందస్తు కార్యాచరణ రూపొందించాలి అని పేర్కొన్నారు.
రైతుల ప్రయోజనాలే లక్ష్యం..
రైతులు పంటలు సాగు చేసిన తర్వాత వర్షాభావ పరిస్థితులు ఎదురైతే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని, అలాంటి పరిస్థితులు తలెత్తకముందే ప్రభుత్వం అప్రమత్తం కావాలని ప్రతినిధులు కోరారు. రైతులు అప్పుల ఊబిలో కూరుకుపో కుండా, వ్యవసాయ రంగాన్ని కాపాడేందు కు ప్రత్యేక కార్యాచరణ తో పాటు అవసరమై న నిధులు కేటాయించాల ని విజ్ఞప్తి చేశారు. బాన్సువాడ నియోజకవర్గ రైతుల సమస్యల ను దృష్టి లో ఉంచుకొని జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని సంబంధిత శాఖల అధికారుల తో సమీక్ష నిర్వహించి తక్షణ చర్యలు చేపట్టాలని వారు కోరారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


