గ్రామస్థాయి నుంచి బూత్ స్థాయి వరకు బీజేపీని బలోపేతం చేయాలి : మాజీ ఎంపీ సీతారాం నాయక్
ములుగు,: బీజేపీ ములుగు జిల్లా కార్యవర్గ సమావేశం బుధవారం ములుగు కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీతారాం నాయక్ మాట్లాడుతూ, పార్టీని గ్రామస్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పటిష్టంగా నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. మండలాల వారీగా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించి ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు, వైఫల్యాలపై పోరాటాలు చేస్తూ ప్రజా సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి నాయకుడు, కార్యకర్త సమన్వయంతో పనిచేసి పోలింగ్ బూత్‌లను బలోపేతం చేయాలని, గ్రామస్థాయిలో పార్టీకి బలమైన పునాది వేసి ఎన్నికలకు సిద్ధం కావాలని దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అజ్మీరా కృష్ణవేణి, భూక్య జవహర్ లాల్, మాజీ జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు జాడి వెంకట్, శిలమంతుల రవీంద్రాచారి, నగరపు రమేష్, గిరిజన మోర్చా నాయకురాలు గుగులోత్ స్వరూప, సీనియర్ నాయకుడు తక్కెళ్లపల్లి దేవేందర్ రావు, జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, మోర్చా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


