నిజాంసాగర్ లో నీరు ఉండగా.. క్రాప్ హాలిడే ఎందుకు..... ?

నిజాంసాగర్ లో నీరు ఉండగా.. క్రాప్ హాలిడే ఎందుకు..... ?

 నిజాంసాగర్ ఆయకట్టు కింద ఉన్న రైతుల పక్షాన రైతుల నిరసన......

 రైతులకు పంటకు నీరు ఇవ్వాలి నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి పంట పొలాలుకు వెంటనే నీరు విడుదల చేయాలి......

 రైతులకు అండగా భారత రాష్ట్ర సమితి పార్టీ ఉంటుంది మోరల్ శ్రీనివాసరావు......

 అంబేద్కర్ విగ్రహానికి, స్థానిక ఆర్డిఓ కు భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యం లో వినతి పత్రం......

 బాన్సువాడ : ప్రభుత్వం రబ్బీ పంట వెయ్యవద్దని క్రాపు హాలిడే ప్రకటించినందుకు సోమవారం భారత రాష్ట్ర సమితి పార్టీ సీనియర్ నాయకులు మోరల్ శ్రీనివాస్ రావు ఆధ్వర్యం లో రైతుల నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మోరల్ శ్రీనివాసరావు ఇంటి వద్ద ఏర్పాటుచేసిన నిరసన కార్యక్రమాలు ఆయన మాట్లాడుతూ. నిజాంసాగర్ ప్రాజెక్టులో 9.1 టిఎంసిల నీరు నిల్వ ఉన్న రబీ పంటలో క్రాప్ హాలిడే ప్రకటించడం ఎంత వరకు సమంజసమని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే నే రైతు ఘోష  ప్రభుత్వమని రైతు పండిస్తే మనం తింటాము కానీ రైతు హాలిడే ప్రకటించడం ఎంత వరకు సమంజసమని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మోరిల్  శ్రీనివాసరావు ప్రశ్నించారు. అంతకు ముందు మాజీ రైతు సమితి అధ్యక్షుడు అంజిరెడ్డి మాట్లాడుతూ. రైతుల పక్షాన గతం లో పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లో ఉన్నప్పుడు ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేసిన సంగతి గుర్తు చేశారు. అనంతరం బాన్సువాడ అంబేద్కర్ చౌరస్తా లోని అంబేద్కర్ విగ్రహానికి, స్థానిక ఆర్డిఓ భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యం లో మొరిల్ శ్రీనివాసరావు నాయకత్వం లో వినోద్ పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం లో భారత రాష్ట్ర సమితి నాయకులు మోచి గణేష్, హకీం, ఖాదర్, నియోజకవర్గం లోని ఆయా గ్రామాల కు చెందిన రైతులు  తదితరులు పాల్గొన్నారు.

Views: 39

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు* అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు*
అందోల్  : సమాజంలోని ప్రతి పేదవాడికి విద్య, వైద్యం, సామాజిక భద్రత కల్పించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వైద్యారోగ్య...
శ్రీరామ్ గ్రూప్ సేవలు అభినందనీయం*
నూతన గృహప్రవేశ వేడుకకు హాజరైన మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
నూతన వధూవరులను ఆశీర్వదించిన కారుకూరి రామ్‌చందర్, నాతరి స్వామి
సుల్తాన్‌పూర్‌లో అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ పత్రాల పంపిణీ
డేంజర్ జోన్ బాధితులకు న్యాయం చేయాలి
వెండి కోల్ గ్రామంలో 20 మందికి కొత్త పింఛన్లు మంజూరు.. లబ్ధిదారులకు పంపిణీ