మంగపేటలో ఘనంగా జాతీయ పత్రికా దినోత్సవ వేడుకలు
మంగపేట : మంగపేట మండల కేంద్రంలో సోమవారం వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం ఆధ్వర్యంలో జాతీయ పత్రికా దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం సభ్యులందరూ కలిసి కేక్ కట్ చేసి, ఒకరికొకరు జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
అనంతరం జరిగిన సమావేశంలో జర్నలిస్టులు మాట్లాడుతూ... సమాజంలో జర్నలిస్టుల పాత్ర, పత్రికా స్వేచ్ఛ యొక్క ప్రాముఖ్యతను కొనియాడారు. ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య వారధిలా నిలచి, నిబద్ధతతో, నిజాయితీగా విధులు నిర్వర్తించాలని, స్వచ్ఛమైన, నిజాయితీ గల ప్రత్యేక పత్రికా విలువలను కాపాడుకుందామని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం అధ్యక్షుడు కటుకూరి సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి ఇప్పలపల్లి రమేష్, కోశాధికారి ఉగ్గుమల్ల గణేష్, ప్రచార కార్యదర్శి తాళ్లూరి మధుకర్, గౌరవ సలహాదారులు ధర్మపురి శ్రీనివాస్, పోలసాని శ్రీనివాస్ రెడ్డి, అలాగే సంఘ సభ్యులు ఈసంపల్లి సురేందర్, స్నేహ కుమార్, గడ్డం ప్రశాంత్, అజరుద్దీన్, యాసం హరీష్, కోడెం నరేష్, బోడ ప్రవీణ్, నూతి వెంకటేశ్వర్లు, తులసి, నవీన్ తదితరులు పాల్గొన్నారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


