జర్నలిస్టులకు పెన్షన్ ఇవ్వాల్సిందే...!

నాగర్‌కర్నూల్‌లో పెన్ను పట్టి పోరాడిన జర్నలిస్టులు - కలెక్టర్‌కు వినతిపత్రం అన్ని జర్నలిస్ట్ సంఘాల మద్దతు... ఐక్యంగా పోరాటానికి సిద్ధం

జర్నలిస్టులకు పెన్షన్ ఇవ్వాల్సిందే...!

నాగర్‌కర్నూల్ : జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ నాగర్‌కర్నూల్‌లో జర్నలిస్టులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. తెలుగు ప్రభ దినపత్రిక చేపట్టిన ‘పెన్ను.. పన్ను.. పెన్షన్’ ఉద్యమానికి అన్ని జర్నలిస్ట్ సంఘాలు మద్దతు ప్రకటించాయి.

జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ జర్నలిస్టు సంఘాలకు అతీతంగా, అన్ని సంఘాలు ఐక్యంగా సంక్షేమం కోసం పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు. జర్నలిస్టులందరూ ఐక్యంగా ఉద్యమించి తమ డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. అయినా జర్నలిస్టుల సంక్షేమంపై ప్రభుత్వం తగిన స్థాయిలో స్పందించకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. తెలుగు ప్రభ చేపట్టిన ‘పెన్ను.. పన్ను.. పెన్షన్’ ఉద్యమానికి అభినందనలు తెలిపారు.
కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు కందికొండ మోహన్, శేఖరాచారి, టి.విజయ్, తెలుగు ప్రభ జిల్లా స్టాఫర్ ఉమాశంకర్, విజన్ ఆంధ్ర జిల్లా స్టాపరూ వెంకటస్వామి, చంద్రారాజు తదితరులు పాల్గొన్నారు.

Views: 96

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు* అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు*
అందోల్  : సమాజంలోని ప్రతి పేదవాడికి విద్య, వైద్యం, సామాజిక భద్రత కల్పించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వైద్యారోగ్య...
శ్రీరామ్ గ్రూప్ సేవలు అభినందనీయం*
నూతన గృహప్రవేశ వేడుకకు హాజరైన మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
నూతన వధూవరులను ఆశీర్వదించిన కారుకూరి రామ్‌చందర్, నాతరి స్వామి
సుల్తాన్‌పూర్‌లో అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ పత్రాల పంపిణీ
డేంజర్ జోన్ బాధితులకు న్యాయం చేయాలి
వెండి కోల్ గ్రామంలో 20 మందికి కొత్త పింఛన్లు మంజూరు.. లబ్ధిదారులకు పంపిణీ