డేంజర్ జోన్ బాధితులకు న్యాయం చేయాలి

నవంబర్ 23న గ్రామసభ నిర్వహించాలని సర్పంచ్ వినతి - గ్రామ సర్పంచ్ బండి స్వామి

డేంజర్ జోన్ బాధితులకు న్యాయం చేయాలి

తాడిచెర్ల : తాడిచెర్ల గ్రామ పరిధిలోని ఓపెన్ కాస్ట్-1 మైన్ కారణంగా డేంజర్ జోన్ పరిధిలోకి వస్తున్న నివాస గృహాలు, వ్యవసాయ భూములు కోల్పోతున్న బాధిత గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని గ్రామ సర్పంచ్ బండి స్వామి కోరారు.ఈ మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌కు గ్రామ పంచాయతీ కార్యాలయం తరఫున వినతిపత్రం సమర్పించారు. ఓపెన్ కాస్ట్-1 మైన్ ప్రభావంతో డేంజర్ జోన్ పరిధిలోకి వస్తున్న గ్రామ ప్రజలు తమ నివాస గృహాలు, వ్యవసాయ భూములు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోందని వినతిపత్రంలో పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా, వారి జీవనోపాధికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
అలాగే బాధిత గ్రామ ప్రజల సమస్యలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యపై చర్చించి బాధితులకు న్యాయం చేసేందుకు ఈ నెల 23న గ్రామసభ నిర్వహించాలని, సంబంధిత అధికారులు గ్రామసభకు హాజరై ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని సర్పంచ్ బండి స్వామి కోరారు.

Views: 94

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు* అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు*
అందోల్  : సమాజంలోని ప్రతి పేదవాడికి విద్య, వైద్యం, సామాజిక భద్రత కల్పించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వైద్యారోగ్య...
శ్రీరామ్ గ్రూప్ సేవలు అభినందనీయం*
నూతన గృహప్రవేశ వేడుకకు హాజరైన మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
నూతన వధూవరులను ఆశీర్వదించిన కారుకూరి రామ్‌చందర్, నాతరి స్వామి
సుల్తాన్‌పూర్‌లో అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ పత్రాల పంపిణీ
డేంజర్ జోన్ బాధితులకు న్యాయం చేయాలి
వెండి కోల్ గ్రామంలో 20 మందికి కొత్త పింఛన్లు మంజూరు.. లబ్ధిదారులకు పంపిణీ