పార్టీలు వేరైనా.. మానవత్వం ఒక్కటే!
అనారోగ్యంతో బాధపడుతున్న బీఆర్ఎస్ నాయకులను పరామర్శించిన కాంగ్రెస్ 15వ డివిజన్ కార్పొరేటర్ ఆకునూరి సుప్రియ రాజకీయాలకు అతీతంగా మానవతా విలువలకు ప్రాధాన్యత
కొత్తగూడెం బ్యూరో : రాజకీయ పార్టీలు వేరైనా మానవత్వం, ఆప్యాయత, స్నేహభావం అందరికీ ఒక్కటేనని 15వ డివిజన్ కార్పొరేటర్ ఆకునూరి సుప్రియ చాటుకున్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బీఆర్ఎస్ నాయకులు హుస్సేన్, మనోజ్‌లను ఆమె పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వారితో కొంతసేపు మాట్లాడి ధైర్యం చెప్పారు. త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి సాధారణ జీవితం గడపాలని ఆకాంక్షించారు. అవసరమైన సమయంలో ఒకరికొకరు అండగా నిలవడమే నిజమైన మానవత్వమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆకునూరి సుప్రియ మాట్లాడుతూ.. రాజకీయాల్లో పార్టీలు, సిద్ధాంతాలు వేరైనా వ్యక్తిగత సంబంధాలు, మానవీయ విలువలు వేరుకావని అన్నారు. రాజకీయాలను పక్కనపెట్టి ఆపదలో ఉన్న వారిని పరామర్శించడం, వారికి మనోధైర్యం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
రాజకీయాలకు అతీతంగా ఆమె చూపిన ఆప్యాయత, మానవతా దృక్పథం పలువురి ప్రశంసలు అందుకుంది.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


