నూతన వధూవరులను ఆశీర్వదించిన కారుకూరి రామ్‌చందర్, నాతరి స్వామి
బెల్లంపల్లి, మంచిర్యాల: బెల్లంపల్లి మండలం తాళ్లగురిజాల గ్రామపంచాయతీకి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాకూరి రామయ్య, సుజాత దంపతుల ద్వితీయ కుమార్తె నేహా వివాహం ప్రవీణ్‌తో సోమవారం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కారుకూరి రామ్‌చందర్, టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులు నేహా, ప్రవీణ్‌లను ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.
అనంతరం డాకూరి రామయ్య, సుజాత దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, భగవంతుని ఆశీస్సులతో వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో తాళ్లగురిజాల సర్పంచ్ వంగ రామన్న, లంబాడి తండా సర్పంచ్ సాగర్ లక్ష్మణ్, గురిజాల ఉపసర్పంచ్, డాకూరి సురేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముత్తె భూమన్న, గుమ్మడి నరసయ్య, యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ బాలు యాదవ్, గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


