ది మిషన్ 11వ వార్షికోత్సవం ఘనంగా... జిల్లాస్థాయి కబడ్డీ టోర్నమెంట్‌లో హోరాహోరీ
యువత చదువులోనే కాదు... క్రీడల్లోనూ ముందుండాలి: ఎక్సైజ్ సీఐ కోటి ఏడుకొండలు విజేతగా మిషన్ టీం... రన్నరప్‌గా పెద్దముదునూరు టీం
నాగర్‌కర్నూల్: ది మిషన్ 11వ వార్షికోత్సవ వేడుకలు నాగర్‌కర్నూల్‌లో ఘనంగా జరిగాయి. వార్షికోత్సవంలో భాగంగా నిర్వహించిన జిల్లాస్థాయి కబడ్డీ టోర్నమెంట్ క్రీడాభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. జిల్లా నలుమూలల నుంచి పలు జట్లు పాల్గొని హోరాహోరీగా తలపడ్డాయి. ప్రతి మ్యాచ్‌లోనూ క్రీడాకారులు చూపిన పట్టుదల, జట్టు స్ఫూర్తి ప్రేక్షకులను అలరించింది.
ఈ కార్యక్రమానికి ఎక్సైజ్ సీఐ శ్రీ కోటి ఏడుకొండలు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అలాగే డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్ పాల్గొని క్రీడాకారులను ప్రోత్సహించారు.
ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ కోటి ఏడుకొండలు మాట్లాడుతూ యువత చదువులోనే కాకుండా క్రీడా రంగంలో కూడా ముందుకు సాగాలని సూచించారు. క్రీడలు శారీరక దారుఢ్యంతో పాటు క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని అన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, క్రీడల వైపు దృష్టి పెట్టాలని యువతకు పిలుపునిచ్చారు. ఇలాంటి టోర్నమెంట్లు గ్రామీణ ప్రతిభను వెలికితీసి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయికి తీసుకెళ్తాయని తెలిపారు.ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో అద్భుత ప్రదర్శన కనబర్చిన మిషన్ టీం మొదటి బహుమతి సాధించి విజేతగా నిలిచింది. హోరాహోరీగా పోరాడిన పెద్దముదునూరు టీం రెండో బహుమతి సాధించింది. విజేతలకు ముఖ్యఅతిథులు బహుమతులు అందజేసి అభినందించారు.కార్యక్రమంలో ది మిషన్ నిర్వాహకులు, క్రీడాకారులు, కోచ్‌లు, క్రీడాభిమానులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


