కారుణ్య చైల్డ్ కేర్ అనాథ ఆశ్రమంలో ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సేవా కార్యక్రమం

చిన్నారులకు నిత్యావసర సరుకులు, పండ్లు, బిస్కెట్లు, స్వీట్ల పంపిణీ

కారుణ్య చైల్డ్ కేర్ అనాథ ఆశ్రమంలో ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సేవా కార్యక్రమం

భద్రాచలం : సేవా భావంతో ఆపన్నులకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రముఖ పర్యావరణ ప్రేమికులు, వృక్షమిత్ర లయన్ డాక్టర్ గోళ్ళ భూపతి రావు అన్నారు.
భద్రాచలంలోని కారుణ్య చైల్డ్ కేర్ అనాథ ఆశ్రమంలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో విద్యనభ్యసిస్తున్న చిన్నారులకు బియ్యం, పప్పులు తదితర నిత్యావసర సరుకులతో పాటు పండ్లు, బిస్కెట్లు, స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న లయన్ డాక్టర్ గోళ్ళ భూపతి రావు మాట్లాడుతూ.. పేదలకు సహాయం చేయడం, తోటి మానవులతో కలిసిమెలిసి జీవించడం, ఆపదలో ఉన్నవారికి అభయహస్తం అందించడం ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని ఆకాంక్షించారు. అనాథ ఆశ్రమంలోని చిన్నారులు కష్టపడి చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగి, తమ విద్యాసంస్థకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు భూషణ్ రావు మాట్లాడుతూ.. అనాథ ఆశ్రమంలోని చిన్నారులకు సేవ చేసే అవకాశం లభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులోనూ మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ నిరుపేదలు, ఆపన్నులకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో  రామచంద్రరావు, వెంకన్న,  విజయలక్ష్మి,  అన్నపూర్ణ, ఆశ్రమ నిర్వాహకులు  సునీల్ తదితరులు పాల్గొన్నారు.

Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు* అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు*
అందోల్  : సమాజంలోని ప్రతి పేదవాడికి విద్య, వైద్యం, సామాజిక భద్రత కల్పించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వైద్యారోగ్య...
శ్రీరామ్ గ్రూప్ సేవలు అభినందనీయం*
నూతన గృహప్రవేశ వేడుకకు హాజరైన మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
నూతన వధూవరులను ఆశీర్వదించిన కారుకూరి రామ్‌చందర్, నాతరి స్వామి
సుల్తాన్‌పూర్‌లో అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ పత్రాల పంపిణీ
డేంజర్ జోన్ బాధితులకు న్యాయం చేయాలి
వెండి కోల్ గ్రామంలో 20 మందికి కొత్త పింఛన్లు మంజూరు.. లబ్ధిదారులకు పంపిణీ