ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయొద్దు

ఫిర్యాదుల విచారణలో పారదర్శకత, జవాబుదారీతనం పాటించాలి బాధితులకు సత్వర న్యాయం అందించాలి

ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయొద్దు


మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్
మెదక్, ప్రజావాణిలో వచ్చే ప్రతి ఫిర్యాదును ప్రాధాన్యతతో పరిశీలించి, నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధితులకు న్యాయం అందించాలని మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు.
సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా భూ వివాదాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక మోసాలు, వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులను పరిశీలించారు. ఆయా సమస్యలపై సమగ్ర విచారణ చేపట్టి, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి జాప్యం చేయకుండా, విచారణ పురోగతిని బాధితులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని స్పష్టం చేశారు.
ప్రజలకు నాణ్యమైన పోలీసు సేవలు అందించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని ఎస్పీ సూచించారు. ప్రతి ఫిర్యాదును బాధ్యతగా స్వీకరిస్తూ, పారదర్శకత, జవాబుదారీతనంతో వ్యవహరించి ప్రజలకు మెరుగైన  సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.

Views: 13

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు* అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు*
అందోల్  : సమాజంలోని ప్రతి పేదవాడికి విద్య, వైద్యం, సామాజిక భద్రత కల్పించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వైద్యారోగ్య...
శ్రీరామ్ గ్రూప్ సేవలు అభినందనీయం*
నూతన గృహప్రవేశ వేడుకకు హాజరైన మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
నూతన వధూవరులను ఆశీర్వదించిన కారుకూరి రామ్‌చందర్, నాతరి స్వామి
సుల్తాన్‌పూర్‌లో అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ పత్రాల పంపిణీ
డేంజర్ జోన్ బాధితులకు న్యాయం చేయాలి
వెండి కోల్ గ్రామంలో 20 మందికి కొత్త పింఛన్లు మంజూరు.. లబ్ధిదారులకు పంపిణీ