కార్తీక సోమవారం వేళ భీమేశ్వరాలయంలో భక్తుల సందడి.. ప్రత్యేక పూజలు, ఏర్పాట్ల పర్యవేక్షణ

తెల్లవారుజాము నుంచే భక్తుల రాక.. కోడె మొక్కులు, కార్తీక దీపాలతో ఆధ్యాత్మిక శోభ క్యూలైన్లు, పారిశుధ్య ఏర్పాట్లను పరిశీలించిన ఈవో రమాదేవి, డీఈవో ప్రతాప నవీన్ కుమార్

కార్తీక సోమవారం వేళ భీమేశ్వరాలయంలో భక్తుల సందడి.. ప్రత్యేక పూజలు, ఏర్పాట్ల పర్యవేక్షణ

వేములవాడ,: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో కార్తీకమాసం మొదటి సోమవారం సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
ఈ సందర్భంగా భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి, కోడె మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో అభిషేకాలు, అన్నపూజలు, నిత్యకల్యాణం, చండీ హోమం, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. గండదీపంలో నూనె పోసి, ఆలయ ప్రాంగణంలోని ఉసిరి చెట్టు కింద కార్తీక దీపాలు వెలిగించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో రమాదేవి, డీఈవో ప్రతాప నవీన్ కుమార్ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. రద్దీకి అనుగుణంగా ఆలయ ఉద్యోగులకు ప్రత్యేక విధులు కేటాయించారు. కోడె క్యూలైన్లు, ఉచిత దర్శనం, శీఘ్రదర్శనం, అతి శీఘ్రదర్శనం క్యూలైన్లతో పాటు ఉచిత తాగునీటి వసతి, కార్తీక దీపాలు వెలిగించే ప్రదేశం, కోడె కట్టే స్తంభం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు.
అలాగే ఆలయ పరిసరాల్లో పారిశుధ్య పనులను తనిఖీ చేసి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సిబ్బందికి సూచించారు. ఈ పర్యవేక్షణలో ఏఈవోలు, పర్యవేక్షకులు, ఆలయ అర్చకులు, వేద పండితులు, ఇతర ఉద్యోగులు, ఎస్పీఎఫ్ సిబ్బంది పాల్గొని భక్తులకు సేవలందించారు.

Views: 19

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు* అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు*
అందోల్  : సమాజంలోని ప్రతి పేదవాడికి విద్య, వైద్యం, సామాజిక భద్రత కల్పించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వైద్యారోగ్య...
శ్రీరామ్ గ్రూప్ సేవలు అభినందనీయం*
నూతన గృహప్రవేశ వేడుకకు హాజరైన మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
నూతన వధూవరులను ఆశీర్వదించిన కారుకూరి రామ్‌చందర్, నాతరి స్వామి
సుల్తాన్‌పూర్‌లో అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ పత్రాల పంపిణీ
డేంజర్ జోన్ బాధితులకు న్యాయం చేయాలి
వెండి కోల్ గ్రామంలో 20 మందికి కొత్త పింఛన్లు మంజూరు.. లబ్ధిదారులకు పంపిణీ