వెన్నచేడ్ మోడల్ స్కూల్‌లో క్లాట్ కోచింగ్‌కు గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు

వెన్నచేడ్ మోడల్ స్కూల్‌లో క్లాట్ కోచింగ్‌కు గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు

గండీడ్ మండలం వెన్నచేడ్ తెలంగాణ మోడల్ స్కూల్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి క్లాట్ (కామన్ లా అడ్మిషన్ టెస్ట్) ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందించేందుకు పార్ట్‌టైమ్ గెస్ట్ ఫ్యాకల్టీని నియమించనున్నారు.ఈ పోస్టులకు ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం లేదా సంబంధిత విభాగంలో పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. ఎంపికైన అభ్యర్థులు రోజుకు రెండు గంటల పాటు బోధించాల్సి ఉంటుంది. ఇందుకు గంటకు రూ.600 చొప్పున పారితోషికం చెల్లించనున్నారు.విద్యార్థులకు సిలబస్‌ ప్రకారం బోధించడంతో పాటు ప్రాక్టీస్ టెస్టులు, అసైన్‌మెంట్లు నిర్వహించి, సందేహాలను నివృత్తి చేయాల్సి ఉంటుంది. ఈ నియామకం పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన మాత్రమే ఉంటుందని, దీనివల్ల రెగ్యులర్ ఉద్యోగానికి ఎలాంటి హక్కులు లభించవని పాఠశాల ప్రిన్సిపాల్ రాయిస్ ఫాతిమా తెలిపారు.

ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 17, 18 తేదీల్లో వెన్నచేడ్ తెలంగాణ మోడల్ స్కూల్‌కు నేరుగా వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. పూర్తి వివరాల కోసం పాఠశాల ను సంప్రదించాలని తెలిపారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు* అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు*
అందోల్  : సమాజంలోని ప్రతి పేదవాడికి విద్య, వైద్యం, సామాజిక భద్రత కల్పించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వైద్యారోగ్య...
శ్రీరామ్ గ్రూప్ సేవలు అభినందనీయం*
నూతన గృహప్రవేశ వేడుకకు హాజరైన మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
నూతన వధూవరులను ఆశీర్వదించిన కారుకూరి రామ్‌చందర్, నాతరి స్వామి
సుల్తాన్‌పూర్‌లో అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ పత్రాల పంపిణీ
డేంజర్ జోన్ బాధితులకు న్యాయం చేయాలి
వెండి కోల్ గ్రామంలో 20 మందికి కొత్త పింఛన్లు మంజూరు.. లబ్ధిదారులకు పంపిణీ