గవర్నర్ కోటా ఎమ్మెల్సీలో బీసీ ఉద్యమకారులకు అవకాశం కల్పించాలి

- జాతీయ బీసీ సంఘం జిల్లా ఇన్‌చార్జి విజయగిరి సమ్మయ్య

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలో బీసీ ఉద్యమకారులకు అవకాశం కల్పించాలి


మల్హర్ : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎంపికల్లో బీసీ సంఘాల నాయకులకు, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన బీసీఉద్యమకారులకు అవకాశం కల్పించాలని జాతీయ బీసీ సంఘం డిమాండ్ చేసింది.జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం కొయ్యూరులో నిర్వహించిన సమావేశంలో జాతీయ బీసీ సంఘం జిల్లా ఇన్‌చార్జి విజయగిరి సమ్మయ్య నాయీ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో బీసీ సంఘాలు, బీసీ ఉద్యమకారులు కీలక పాత్ర పోషించారని తెలిపారు. శ్రీకాంతాచారి, కానిస్టేబుల్ కిష్టయ్య ముదిరాజ్, రంగయ్య నాయీ తదితరులు తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగాలు చేశారని గుర్తుచేశారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు బీసీ సంఘాల నాయకులు తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నప్పటికీ, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమకారులకు ఆశించిన స్థాయిలో సామాజిక న్యాయం జరగలేదని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమకారుల కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసిందని, ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల చట్టం తీసుకొచ్చారని పేర్కొంటూ, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎంపికల్లో బీసీ సంఘాల నాయకులను, బీసీ ఉద్యమకారులను గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.అలాగే చట్టసభల్లో ప్రాతినిధ్యం లేని బీసీ కులాలకు కూడా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని కోరారు. సామాజిక న్యాయం, సామాజిక తెలంగాణ లక్ష్యంగా ముఖ్యమంత్రి బీసీలకు తగిన ప్రాధాన్యత కల్పిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Views: 37

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు* అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు*
అందోల్  : సమాజంలోని ప్రతి పేదవాడికి విద్య, వైద్యం, సామాజిక భద్రత కల్పించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వైద్యారోగ్య...
శ్రీరామ్ గ్రూప్ సేవలు అభినందనీయం*
నూతన గృహప్రవేశ వేడుకకు హాజరైన మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
నూతన వధూవరులను ఆశీర్వదించిన కారుకూరి రామ్‌చందర్, నాతరి స్వామి
సుల్తాన్‌పూర్‌లో అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ పత్రాల పంపిణీ
డేంజర్ జోన్ బాధితులకు న్యాయం చేయాలి
వెండి కోల్ గ్రామంలో 20 మందికి కొత్త పింఛన్లు మంజూరు.. లబ్ధిదారులకు పంపిణీ