కలెక్టరేట్ ఎదుట సాగర సంఘం ధర్నా... నినాదాలతో హోరెత్తిన కలెక్టరేట్

బీసీ-డీ నుంచి ఏ-కేటగిరీలోకి మార్చాలి... ఫెడరేషన్‌ను పాలకమండలిగా చేయాలి

కలెక్టరేట్ ఎదుట సాగర సంఘం ధర్నా... నినాదాలతో హోరెత్తిన కలెక్టరేట్

నాగర్‌కర్నూల్  : సాగరుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట సాగర సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి సాగరులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీసీ-డీ గ్రూపులో ఉన్న సాగరులను ఏ-కేటగిరీలోకి మార్చాలని విజ్ఞప్తి చేశారు. సాగర ఫెడరేషన్‌ను పాలకమండలిగా మార్చాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు పనుల్లో సాగరులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు.సాగరులకు ఆరోగ్య భద్రత కార్డులు జారీ చేయాలని, అర్హులైన సాగరులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పనులు నిర్వహించే సమయంలో ప్రమాదాలు జరిగితే బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు. హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై సాగర మహర్షి భగీరథుడి విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సాగరుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ధర్నాలో జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీను, వర్కింగ్ ప్రెసిడెంట్ రాముడు మేస్త్రీ, మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు విజయలక్ష్మి, కొమ్ము శ్రీను, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.

Views: 35

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు* అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు*
అందోల్  : సమాజంలోని ప్రతి పేదవాడికి విద్య, వైద్యం, సామాజిక భద్రత కల్పించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వైద్యారోగ్య...
శ్రీరామ్ గ్రూప్ సేవలు అభినందనీయం*
నూతన గృహప్రవేశ వేడుకకు హాజరైన మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
నూతన వధూవరులను ఆశీర్వదించిన కారుకూరి రామ్‌చందర్, నాతరి స్వామి
సుల్తాన్‌పూర్‌లో అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ పత్రాల పంపిణీ
డేంజర్ జోన్ బాధితులకు న్యాయం చేయాలి
వెండి కోల్ గ్రామంలో 20 మందికి కొత్త పింఛన్లు మంజూరు.. లబ్ధిదారులకు పంపిణీ