కేసీఆర్ సీఎం కావాలని పాదయాత్ర చేసిన యువకుడికి ఇల్లు: అంకిళ్ళలో ఘనంగా భూమిపూజ
కోయిలకొండ, : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) గారు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ.. కోయిలకొండ మండలం అంకిళ్ళ గ్రామం నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసిన అంకిళ్ళ యువకుడు రాంచందర్ నిస్వార్థ దీక్షకు గుర్తింపు లభించింది.
గతంలో రాంచందర్ సాహసాన్ని మెచ్చి, ఆయనకు ఇల్లు నిర్మించి ఇస్తామని గౌరవ మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు (కేటీఆర్) గారు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో నారాయణపేట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు ఎస్. రాజేందర్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం.. వారి ఆదేశానుసారంగా నేడు అంకిళ్ళ గ్రామంలో నూతన గృహ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అంకిళ్ళ గ్రామ మరియు కోయిలకొండ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని యువకుడు రాంచందర్‌ను అభినందించారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


