45వ రాష్ట్రస్థాయి షూటింగ్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌ ముగింపు

45వ రాష్ట్రస్థాయి షూటింగ్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌ ముగింపు

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం గ్రామంలోని పల్లవి మోడల్ స్కూల్‌లో నవంబర్‌ 14 నుంచి 16 వరకు నిర్వహించిన 45వ రాష్ట్రస్థాయి బాలికల షూటింగ్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు ఘనంగా ముగిశాయి. రాష్ట్రంలోని 33 జిల్లాలకు ఆహ్వానం అందించగా, 28 జిల్లాల క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు.

ఈ పోటీల్లో నాగర్‌కర్నూల్‌ జిల్లా జట్టు ప్రథమ, మహబూబ్‌నగర్‌ జిల్లా జట్టు ద్వితీయ, మహబూబాబాద్‌ జిల్లా జట్టు తృతీయ స్థానాలు సాధించాయి. ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పర్వతగిరి మండల విద్యాధికారి బిక్షపతి విజేతలకు ట్రోఫీలు, మెడల్స్‌, సర్టిఫికెట్లు అందజేశారు.

రాష్ట్రస్థాయిలో ఎంపికైన క్రీడాకారులు ఉత్తరప్రదేశ్‌లో జరిగే జాతీయస్థాయి పోటీల్లో తెలంగాణ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నట్లు రాష్ట్ర షూటింగ్‌బాల్‌ ప్రధాన కార్యదర్శి ఐలయ్య తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాకారులు జాతీయస్థాయిలోనూ రాణించాలని పలువురు వక్తలు ఆకాంక్షించారు.

కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ గాడిపెల్లి మహేందర్‌, అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు నాగయ్య, కార్యదర్శి అనిల్‌కుమార్‌, పాఠశాల చైర్మన్‌ రాచకొండ అశోక్‌ చారి, కరస్పాండెంట్‌ గంజి మహేందర్‌, డైరెక్టర్‌ కోటగిరి రమేష్‌, ప్రిన్సిపాల్‌ మేకల అశ్విని తదితరులు పాల్గొన్నారు.

Views: 17

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు* అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు*
అందోల్  : సమాజంలోని ప్రతి పేదవాడికి విద్య, వైద్యం, సామాజిక భద్రత కల్పించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వైద్యారోగ్య...
శ్రీరామ్ గ్రూప్ సేవలు అభినందనీయం*
నూతన గృహప్రవేశ వేడుకకు హాజరైన మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
నూతన వధూవరులను ఆశీర్వదించిన కారుకూరి రామ్‌చందర్, నాతరి స్వామి
సుల్తాన్‌పూర్‌లో అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ పత్రాల పంపిణీ
డేంజర్ జోన్ బాధితులకు న్యాయం చేయాలి
వెండి కోల్ గ్రామంలో 20 మందికి కొత్త పింఛన్లు మంజూరు.. లబ్ధిదారులకు పంపిణీ