కాటారం మార్కెట్ కమిటీ అభివృద్ధికి కీలక నిర్ణయాలు

రైతులకు మెరుగైన మౌలిక వసతుల కల్పనే లక్ష్యం: చైర్‌పర్సన్ పంతకాని తిరుమల

కాటారం మార్కెట్ కమిటీ అభివృద్ధికి కీలక నిర్ణయాలు

కాటారం (భూపాలపల్లి): ఐ టి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవతో కాటారం వ్యవసాయ మార్కెట్ కమిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ పంతకాని తిరుమల తెలిపారు. సోమవారం మార్కెట్ కమిటీ పాలకవర్గ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డులో రైతులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై చర్చించి పలు కీలక తీర్మానాలు చేశారు. మార్కెట్ యార్డులో రైతుల విశ్రాంతి భవనం, విద్యుత్ సెంట్రల్ లైటింగ్, కోల్డ్ స్టోరేజ్ గోదాముల నిర్మాణానికి పాలకవర్గం తీర్మానించింది. పంట కోతలు ప్రారంభమైన నేపథ్యంలో రైతులు తమ పంటలను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని చైర్‌పర్సన్ సూచించారు. వ్యాపారులందరూ తప్పనిసరిగా లైసెన్సులు పొందిన తర్వాతే అధికారికంగా పంటల కొనుగోళ్లు చేపట్టాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మార్కెట్ యార్డును అభివృద్ధి చేయడంతో పాటు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని ఆమె పేర్కొన్నారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ బ్రహ్మారెడ్డి, డైరెక్టర్లు పిల్లమరి రమేష్, తిరుపతిరావు, రామకృష్ణ, శ్రీనివాస్ రెడ్డి, సంతోష్, ఇర్షాద్, సడవలి రాజారాం, ఏడీఏ, మార్కెట్ సెక్రటరీ లా షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.

Views: 56

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు* అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు*
అందోల్  : సమాజంలోని ప్రతి పేదవాడికి విద్య, వైద్యం, సామాజిక భద్రత కల్పించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర వైద్యారోగ్య...
శ్రీరామ్ గ్రూప్ సేవలు అభినందనీయం*
నూతన గృహప్రవేశ వేడుకకు హాజరైన మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
నూతన వధూవరులను ఆశీర్వదించిన కారుకూరి రామ్‌చందర్, నాతరి స్వామి
సుల్తాన్‌పూర్‌లో అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ పత్రాల పంపిణీ
డేంజర్ జోన్ బాధితులకు న్యాయం చేయాలి
వెండి కోల్ గ్రామంలో 20 మందికి కొత్త పింఛన్లు మంజూరు.. లబ్ధిదారులకు పంపిణీ