చిన్నారులే ఉపాధ్యాయులైన వేళ
ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
చందుర్తి : మండలంలోని మర్రిగడ్డ ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చిన్నారి ఉపాధ్యాయులుగా మారి తమ తోటి విద్యార్థులకు పాఠాలు బోధించి ప్రతిభను చాటుకున్నారు. అనంతరం నిర్వహించిన ఇష్టాగోష్టి కార్యక్రమంలో విద్యార్థులు వేదికపై తమ అభిప్రాయాలను, భావాలను పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు భార్గవి మాట్లాడుతూ.. విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తమలోని నైపుణ్యాలను అద్భుతంగా ప్రదర్శించారని ప్రశంసించారు. బాల్యం నుంచే నాయకత్వ లక్షణాలను అలవర్చుకొని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు పాటలు, పద్యాలు ఆలపించడంతో పాటు నృత్యాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామస్వామి, సాగరిక, చిన్నారి ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


