పోలీస్ ఉద్యోగ అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ
కాటారం (భూపాలపల్లి): పోలీస్ ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ శ్రీపాద చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పంపిణీ చేశారు. ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీనుబాబు ఆదేశాల మేరకు కాటారం మండలం గారేపల్లి సువిద్య పాఠశాలలో నిర్వహిస్తున్న పోలీస్ ఉద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణ కార్యక్రమంలో భాగంగా స్టడీ మెటీరియల్ అందజేశారు. ఉద్యోగాలకు పోటీపడి చదవడమే కాకుండా, మారుతున్న కాలానికి అనుగుణంగా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని ఈ సందర్భంగా పలువురు సూచించారు. సువిద్యా పాఠశాల కరస్పాండెంట్ కొట్టే శ్రీశైలం పలువురు పాల్గొని పోటీ అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. నాలుగు నెలలుగా అభ్యర్థులకు ఉచిత శిక్షణతో పాటు భోజన వసతిని కల్పించిన మంత్రి శ్రీధర్ బాబుకు శిక్షణార్థులు కృతజ్ఞతలు తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


