బేలా మండల కేంద్రంలో 'చేయూత' పింఛన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే, ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి
ఆదిలాబాద్ బ్యూరో : ఆదిలాబాద్ జిల్లా బేలా మండల కేంద్రంలో నిర్వహించిన 'చేయూత' పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు నూతన పింఛన్ కార్డులను పంపిణీ చేసి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 'చేయూత' వంటి పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. నిరుపేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే ఉద్ధేశంతో ప్రతి నెలా క్రమం తప్పకుండా ఆసరా, చేయూత పింఛన్లను అందిస్తూ ప్రభుత్వం అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ సంతోష్ రావు, స్పెషల్ ఆఫీసర్ మనోహర్, ఎంపీడీఓ మహేష్ కుమార్, జైనథ్ మాజీ మార్కెట్ చైర్మన్ అశోక్ రెడ్డి, సర్పంచ్ భోక్రే శంకర్, రాందాస్ నక్లే, వామన్ వాంఖడే, రూప్రావ్, సంజయ్ గుండావర్, శాంతన్ మరియు తదితర నాయకులు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


