20 ఏళ్లుగా సీసీ రోడ్డు కోసం ఎదురుచూపులు.. పట్టించుకోని పాలకులు!
సీసీ రోడ్డు మంజూరు చేయాలని సబ్ కలెక్టర్‌కు గ్రామస్థుడి వినతి
మల్హర్ : మండలంలోని ఇప్పలపల్లి గ్రామపంచాయతీ పరిధిలో తమ గ్రామంలో సీసీ రోడ్డు నిర్మించాలని కోరుతూ అక్కల బాబు యాదవ్ కాటారం సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలోని మెయిన్ రోడ్డు నుంచి అక్కల సురేష్ ఇంటి వద్ద నుంచి అక్కల చిన్నబాబు యాదవ్ ఇంటి వరకు గత 20 సంవత్సరాలుగా సీసీ రోడ్డు లేకపోవడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులుఎదుర్కొంటున్నారని తెలిపారు ప్రభుత్వాలు మారుతున్నా తమ గ్రామంలో కనీస మౌలిక సదుపాయమైన సీసీ రోడ్డు నిర్మాణం జరగకపోవడంవిచారకరమన్నారు. వర్షాకాలంలో ప్రజలు మరింత ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని సంబంధిత అధికారులు స్పందించి వెంటనే సీసీ రోడ్డు మంజూరు చేయాలని, గ్రామ అభివృద్ధికి సహకరించాలని కాటారం సబ్ కలెక్టర్‌ను అక్కల బాబు యాదవ్ విజ్ఞప్తి చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

