40 సంవత్సరాల సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ చేసిన పరిచారకుడు బిక్షపతికి ఘన సన్మానం – వీడ్కోలు
కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో గత 40 సంవత్సరాలుగా పరిచారకుడిగా విశేష సేవలందించిన శ్రీ బిక్షపతి గారు ఈరోజు పదవీ విరమణ చేసిన సందర్భంగా దేవస్థానం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి కట్ట సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ, నాలుగు దశాబ్దాల పాటు దేవస్థానంలో అంకితభావంతో, నిబద్ధతతో సేవలందించిన శ్రీ బిక్షపతి గారి సేవలు ప్రశంసనీయమని, దేవస్థానం అభివృద్ధి మరియు నిత్య కైంకర్యాల నిర్వహణలో ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో సహాయ కార్యనిర్వహణాధికారి బుద్ధి శ్రీనివాసులు, సూపరింటెండెంట్ నీల చంద్రశేఖర్, ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున, అర్చక బృందం, వేద పాఠశాల విద్యార్థులు మరియు దేవస్థాన సిబ్బంది పాల్గొని శ్రీ బిక్షపతి గారికి ఆత్మీయంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా పదవీ విరమణ అనంతరం శ్రీ బిక్షపతి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని శ్రీ మల్లికార్జున స్వామివారిని ప్రార్థించారు..
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


