జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో సత్తా చాటిన ప్రభుత్వ జూనియర్ (బాలుర) కళాశాల విద్యార్థి

అభినందించిన కళాశాల ప్రిన్సిపాల్ చెన్నూరి గంగాధర్

జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో సత్తా చాటిన ప్రభుత్వ జూనియర్ (బాలుర) కళాశాల విద్యార్థి

హుస్నాబాద : సిద్దిపేట జిల్లా స్థాయిలో నిర్వహించిన అథ్లెటిక్స్ పోటీల్లో అండర్-19 విభాగంలో 400 మీటర్ల పరుగు పందెంలో ద్వితీయ స్థానం సాధించి ప్రతిభ చాటిన ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలుర) హుస్నాబాద్ ,విద్యార్థి జి రిశ్వంత్ ను కళాశాల ప్రిన్సిపాల్ చెన్నూరి గంగాధర్ మరియు అధ్యాపక బృందం అభినందించారు.
2026 అక్టోబర్ 26న సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో వివిధ ప్రాంతాల నుంచి పాల్గొన్న క్రీడాకారులతో పోటీపడి 
జి రిశ్వంత్ 400 మీటర్ల పరుగు పందెంలో రెండవ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. క్రీడల పట్ల ఆసక్తి, నిరంతర సాధన, పట్టుదలతో ఈ విజయాన్ని సాధించడం పట్ల కళాశాల బృందం హర్షం వ్యక్తం చేసింది.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ చెన్నూరి గంగాధర్ మాట్లాడుతూ,విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ చురుకుగా పాల్గొని తమ ప్రతిభను వెలికితీయాలని సూచించారు.క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, సమయపాలన, పట్టుదల మరియు జట్టుస్ఫూర్తిని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.జిల్లా స్థాయి పోటీల్లో ద్వితీయ స్థానం సాధించడం అభినందనీయమని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థాయి పోటీల్లో పాల్గొని కళాశాలకు, తమ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి చదువుతో పాటు క్రీడలకు కూడా కళాశాల ప్రాధాన్యత ఇస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.జి. రిశ్వంత్ సాధించిన ఈ విజయం తోటి విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్.గంగాధర్, అధ్యాపకులు డాక్టర్ ఎస్. ఎస్.రాజు,ఎస్.సత్యనారాయణ ,వి.సదాశివ్,  
వి రజనీ, బి.ఎల్లయ్య, బి. వాల్య ,ఎస్. వెంకట ముత్యం,పి. చంద్రమోహన్, టి రణధీర్ కుమార్ , సిహెచ్ రాజిరెడ్డి, ఎస్. అశోక్, ఆర్.వెంకటేష్, ఏ. మమత,  గ్రంథ పాలకులు ఆర్.వాసవి, వెంకటసాయి, శ్వేత మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Views: 51

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

రైతులకు ప్రధానమంత్రి కిసాన్ నిధులను విడుదల చేసిన మోడీ. రైతులకు ప్రధానమంత్రి కిసాన్ నిధులను విడుదల చేసిన మోడీ.
  బాన్సువాడ :  ప్రధానమంత్రి కిసాన్ నిధులను శుక్రవారం విడుదల చేసిన మోడీ. దేశ ప్రధాని నరేంద్ర మోదీ   గుజరాత్ లో ప్రధాన మంత్రి కిసాన్ ఉత్సవ
బి.పి., షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు - నవంబర్ 1న నాగర్ కర్నూల్ లో వైద్య శిబిరం: డా. మణికంఠ జగదీష్
షంషీర్ నగర్ స్మశాన వాటికలో అక్రమ షెడ్డు తొలగింపు
పోచమ్మ ఆలయ గద్దెల కూల్చివేతపై బస్తీవాసుల ఆగ్రహం!
రాళ్లతో దాడి బాధితుడికి న్యాయం చేయాలి
భూ రీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి
పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పెద్దకొత్తపల్లి మండలం చెన్నాపురావుపల్లిలో ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్