జీఎంపీవీఎస్ సిద్దిపేట, జనగామ జిల్లాల ఇంచార్జిగా అందె అశోక్.

జీఎంపీవీఎస్ సిద్దిపేట, జనగామ జిల్లాల ఇంచార్జిగా అందె అశోక్.

సిద్దిపేట జిల్లా చేర్యాల   : గొర్రెల, మేకల పెంపకం వృత్తిదారుల సంఘం (జీఎంపీవీఎస్) సిద్దిపేట, జనగామ జిల్లాల ఇంచార్జిగా మండలంలోని ఆకునూరు గ్రామానికి చెందిన అందె అశోక్ ను నియమించారు. హైదరాబాద్ లోని రాజ్ బహదూర్ గౌర్ విజ్ఞాన కేంద్రంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో నియామక పత్రాన్ని అందజేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గొల్ల, కురుమలకు గొర్రెలు, మేకల పెంపకం కోసం 75 శాతం సబ్సిడీతో రుణాలు మంజూరు చేయాలని, అడవిలో గొర్రెలు, మేకలు మేపుకునేందుకు హక్కులు కల్పించాలన్నారు.ప్రమాదవశాత్తు మరణించిన పశువులకు నష్టపరిహారం చెల్లించాలని, 10 లక్షల వరకు ఎలాంటి షరతులు లేకుండా బ్యాంక్ రుణాలు మంజూరు చేయాలని, గొల్ల, కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి బడ్జెట్ లో రూ.10 వేల కోట్లు కేటాయించాలన్నారు. 50 ఏళ్లు నిండిన గొల్ల కుర్మలకు రూ. 5 వేల పెన్షన్ ఇవ్వాలన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. నియామకానికి సహకరించిన రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కొమ్ము అశోక్ యాదవ్, ఎల్. శ్రవణ్ కుమార్ యాదవ్ లకు కృతజ్ఞతలు తెలిపారు.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మెట్ పల్లి మున్సిపల్ సమావేశంలో కౌన్సిలర్ల మూకుమ్మడి వాకౌట్‌! మెట్ పల్లి మున్సిపల్ సమావేశంలో కౌన్సిలర్ల మూకుమ్మడి వాకౌట్‌!
మెట్ పల్లి డివిజన్ : మెట్ పల్లి మున్సిపాలిటీలో పాలకవర్గం, కౌన్సిలర్ల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. మున్సిపల్ చైర్‌పర్సన్ మైలారపు లింబాద్రి వ్యవహారశైలిని నిరసిస్తూ మున్సిపాలిటీ సాధారణ...
ఇంటి తాళాలు పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాల చోరీకి పాల్పడిన నిందితుడి అరెస్ట్
ఆరోగ్య పరిరక్షణే మనందరి ప్రథమ కర్తవ్యం: జిల్లా కలెక్టర్ రాజర్షిషా
జీఎంపీవీఎస్ సిద్దిపేట, జనగామ జిల్లాల ఇంచార్జిగా అందె అశోక్.
ప్రతి ఓటమి నుండి ఒక పాఠం నేర్చుకోవాలి
జిల్లా పంచాయతీ అధికారి ఆకస్మిక పర్యటన
ఎండుతున్న పంటను చూసి ఆవేదన.. గుండెపోటుతో రైతు మృతి