రక్తదానం చేసి బాధితుల జీవితాల్లో వెలుగులు నింపాలి

సీపీ సాయిచైతన్య

రక్తదానం చేసి బాధితుల జీవితాల్లో వెలుగులు నింపాలి

నిజామాబాద్ :  అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు రక్తదానం చేసి బాధితుల జీవితాల్లో వెలుగులు నింపాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. పోలీసు సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నిజామాబాద్ నగరంలోని పరేడ్​ గ్రౌండ్​లో రెడ్​క్రాస్​ ఆధ్వర్యంలో భారీ ఎత్తున రక్తదాన శిబిరం నిర్వహించారు. స్వచ్ఛందంగా రక్తదానం చేసిన పోలీసులు.. ఈ సందర్భంగా శిబిరంలో పలువురు పోలీసులు, కళాశాలల విద్యార్థులు, యువకులు రక్తదానం చేశారు. వారిని సీపీ ప్రత్యేకంగా అభినందించారు. రక్తదానం మహాదానమని.. విలువైన ప్రాణాలు కాపాడే లైఫ్​లైన్​ అని ఆయన పేర్కొన్నారు. ఏసీపీ ప్రకాశ్​, రూరల్​ సీఐ శ్రీధర్​, ఉమెన్​ పీఎస్​ సీఐ ప్రసాద్​, నాల్గో టౌన్​ సీఐ సతీష్​తో సహా సుమారు 200మంది రక్తదానం చేశారు. కార్యక్రమంలో రెడ్​క్రాస్​ సొసైటీ ఛైర్మన్​ పోతన్​కర్​ లక్ష్మీనారాయణ, వైస్​ ఛైర్మన్​ డాక్టర్​ సీనునాయక్​, కోశాధికారి కెంపుల నాగరాజు కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్​ రజనీకాంత్​ తదితరులు పాల్గొన్నారు.

Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

రైతులకు ప్రధానమంత్రి కిసాన్ నిధులను విడుదల చేసిన మోడీ. రైతులకు ప్రధానమంత్రి కిసాన్ నిధులను విడుదల చేసిన మోడీ.
  బాన్సువాడ :  ప్రధానమంత్రి కిసాన్ నిధులను శుక్రవారం విడుదల చేసిన మోడీ. దేశ ప్రధాని నరేంద్ర మోదీ   గుజరాత్ లో ప్రధాన మంత్రి కిసాన్ ఉత్సవ
బి.పి., షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు - నవంబర్ 1న నాగర్ కర్నూల్ లో వైద్య శిబిరం: డా. మణికంఠ జగదీష్
షంషీర్ నగర్ స్మశాన వాటికలో అక్రమ షెడ్డు తొలగింపు
పోచమ్మ ఆలయ గద్దెల కూల్చివేతపై బస్తీవాసుల ఆగ్రహం!
రాళ్లతో దాడి బాధితుడికి న్యాయం చేయాలి
భూ రీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి
పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పెద్దకొత్తపల్లి మండలం చెన్నాపురావుపల్లిలో ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్