పోచమ్మ ఆలయ గద్దెల కూల్చివేతపై బస్తీవాసుల ఆగ్రహం!

ముందస్తు సమాచారం లేకుండానే తొలగించారంటూ అశోక్‌నగర్‌ వాసుల ఆందోళన , ఆలయ నిర్మాణానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సహకరించాలని విజ్ఞప్తి

పోచమ్మ ఆలయ గద్దెల కూల్చివేతపై బస్తీవాసుల ఆగ్రహం!

బెల్లంపల్లి, (మంచిర్యాలజిల్లా) తమ ఇష్టదైవమైన పోచమ్మ, మైసమ్మ ఆలయ నిర్మాణం కోసం ఏర్పాటు చేసుకున్న గద్దెలను సింగరేణి అధికారులు కూల్చివేయడంపై బెల్లంపల్లి  అశోక్ ‌నగర్‌ బస్తీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా సింగరేణి ఎస్‌అండ్‌పీసీ సిబ్బంది గద్దెలను తొలగించారని ఆరోపిస్తూ శుక్రవారం ఆందోళనకు దిగారు.బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రి ప్రహరీ గోడను ఆనుకుని ఉన్న ఖాళీ స్థలంలో బస్తీవాసులు పోచమ్మ, మైసమ్మ ఆలయాన్ని నిర్మించుకోవాలని నిర్ణయించుకున్నారు. చెత్తాచెదారంతో నిండిన స్థలాన్ని శుభ్రం చేసి, అందరూ కలిసి చిన్న గద్దెలను ఏర్పాటు చేసుకున్నారు. అయితే శుక్రవారం ఉదయం సింగరేణి సంస్థకు చెందిన ఎస్‌అండ్‌పీసీ సిబ్బంది వాటిని కూల్చివేయడంతో స్థానికులు నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా బస్తీ మహిళలు మాట్లాడుతూ.. తాము సుమారు 70 ఏళ్లుగా ఈ ప్రాంతంలో నివసిస్తున్నామని తెలిపారు. బస్తీవాసులందరి నమ్మకానికి ప్రతీకగా పోచమ్మ, మైసమ్మ ఆలయాన్ని నిర్మించుకోవాలనుకుంటున్నామని చెప్పారు. ఆలయ గద్దెలను కూల్చివేయడం తమ మనోభావాలను దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి ఆలయ నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

రైతులకు ప్రధానమంత్రి కిసాన్ నిధులను విడుదల చేసిన మోడీ. రైతులకు ప్రధానమంత్రి కిసాన్ నిధులను విడుదల చేసిన మోడీ.
  బాన్సువాడ :  ప్రధానమంత్రి కిసాన్ నిధులను శుక్రవారం విడుదల చేసిన మోడీ. దేశ ప్రధాని నరేంద్ర మోదీ   గుజరాత్ లో ప్రధాన మంత్రి కిసాన్ ఉత్సవ
బి.పి., షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు - నవంబర్ 1న నాగర్ కర్నూల్ లో వైద్య శిబిరం: డా. మణికంఠ జగదీష్
షంషీర్ నగర్ స్మశాన వాటికలో అక్రమ షెడ్డు తొలగింపు
పోచమ్మ ఆలయ గద్దెల కూల్చివేతపై బస్తీవాసుల ఆగ్రహం!
రాళ్లతో దాడి బాధితుడికి న్యాయం చేయాలి
భూ రీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి
పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పెద్దకొత్తపల్లి మండలం చెన్నాపురావుపల్లిలో ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్