ఎండుతున్న పంటను చూసి ఆవేదన.. గుండెపోటుతో రైతు మృతి
ముప్పిరెడ్డిపల్లిలో విషాదం.. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థుల విజ్ఞప్తి
మనోహరాబాద్ : ఆరుగాలం కష్టపడి సాగు చేసిన వరి పంట నీరు లేక ఎండిపోతుండటంతో తీవ్ర ఆవేదనకు గురైన రైతు గుండెపోటుతో మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామంలో విషాదాన్ని నింపింది.గ్రామానికి చెందిన సాదు నర్సింలు తనకున్న పొలంలో వరి సాగు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ ఏడాది వర్షాలు లేకపోవడం, బోరులో నీరు అందకపోవడంతో పంట ఎండిపోతుండటాన్ని చూసి ఆందోళనకు గురయ్యాడు. పంట చేతికందకపోతే కుటుంబాన్ని ఎలా పోషించాలనే దిగులుతో ఉన్నాడు.ఈ క్రమంలో గురువారం ఉదయం ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు తెలిసింది. నిత్యం పొలం పనుల్లో నిమగ్నమై కుటుంబానికి అండగా నిలిచిన నర్సింలు ఆకస్మికంగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.పంట నష్టంతో పాటు కుటుంబ పెద్దను కోల్పోయిన బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


