రాళ్లతో దాడి బాధితుడికి న్యాయం చేయాలి

హత్యాయత్నం కోణంలో విచారణ జరపాలి సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించాలి

రాళ్లతో దాడి  బాధితుడికి న్యాయం చేయాలి

దౌల్తాబాద్‌,సిద్దిపేట: మండల కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద ఈ నెల 26న రాత్రి ఐదో వార్డు సభ్యుడు కేంసారం నాగరాజుపై జరిగిన రాళ్ల దాడి ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరపాలని స్థానికులు కోరారు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి దాడికి పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దాడి ఘటనను హత్యాయత్నం కోణంలోనూ పరిశీలించాలని, వైద్య నివేదికలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా దర్యాప్తు చేయాలని కోరారు. కులవివక్ష కారణంగా దాడి జరిగినట్లు తేలితే అట్రాసిటీ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని, ఎలాంటి పక్షపాతం లేకుండా విచారణ జరిపి బాధితుడు నాగరాజుకు న్యాయం చేయాలని గ్రామస్థులు డిమాండ్‌ చేశారు.

Views: 446

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

రైతులకు ప్రధానమంత్రి కిసాన్ నిధులను విడుదల చేసిన మోడీ. రైతులకు ప్రధానమంత్రి కిసాన్ నిధులను విడుదల చేసిన మోడీ.
  బాన్సువాడ :  ప్రధానమంత్రి కిసాన్ నిధులను శుక్రవారం విడుదల చేసిన మోడీ. దేశ ప్రధాని నరేంద్ర మోదీ   గుజరాత్ లో ప్రధాన మంత్రి కిసాన్ ఉత్సవ
బి.పి., షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు - నవంబర్ 1న నాగర్ కర్నూల్ లో వైద్య శిబిరం: డా. మణికంఠ జగదీష్
షంషీర్ నగర్ స్మశాన వాటికలో అక్రమ షెడ్డు తొలగింపు
పోచమ్మ ఆలయ గద్దెల కూల్చివేతపై బస్తీవాసుల ఆగ్రహం!
రాళ్లతో దాడి బాధితుడికి న్యాయం చేయాలి
భూ రీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి
పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పెద్దకొత్తపల్లి మండలం చెన్నాపురావుపల్లిలో ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్