ఢిల్లీ మహా మార్చ్‌కు హుస్నాబాద్ కాంగ్రెస్ మద్దతు

ఓటు హక్కు పరిరక్షణకు కాంగ్రెస్ పోరాటం

ఢిల్లీ మహా మార్చ్‌కు హుస్నాబాద్ కాంగ్రెస్ మద్దతు

హుస్నాబాద్ :  ఓట్ బచావో–దేశ్ బచావో నినాదంతో కాంగ్రెస్ జాతీయ నాయకత్వం చేపట్టిన చలో ఢిల్లీ మహా మార్చ్‌కు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ సంఘీభావం తెలిపింది.ఈ సందర్బంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఆదివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి మద్దతుగా పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలన్న కాంగ్రెస్ పార్టీ డిమాండ్‌కు మద్దతు ప్రకటించారు.సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో మంత్రి, హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో నియోజకవర్గం నుంచి ఢిల్లీకి వెళ్లి మహా మార్చ్‌లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులను స్థానిక నాయకులు అభినందించారు.అనంతరం వారు మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి పౌరుడికి పరిరక్షించాలని కోరారు.ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో పెద్ద సంఖ్యలో ఓటర్ల పేర్లు తొలగించారన్న కాంగ్రెస్ ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా చూడాలని, తొలగించిన పేర్లను తిరిగి చేర్చాలని కోరారు. ఎన్నికల సంఘం స్వతంత్రంగా, పారదర్శకంగా వ్యవహరించాలని, ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్‌ను ప్రస్తావించారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించే నిరసన కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకాలు కల్పించరాదని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్‌పర్సన్ చిత్తారి పద్మ, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ కేడం లింగమూర్తి, సీనియర్ నాయకులు చిత్తారి రవీందర్, ఆకుల వెంకట్, కౌన్సిలర్లు పిల్లి తిరుపతి, కొండ రజిత, బత్తుల స్వరూప, కో ఆప్షన్ సభ్యులు ఎం.డి. హసన్, మాజీ సర్పంచ్ లు వంగర మల్లేశం, బొంగొని శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ వల్లపు రాజు, నాయకులు బిక్యా నాయక్, పూదరి శ్రీనివాస్, ముప్పిడి రాజిరెడ్డి, అలువోజు రవీందర్, లక్ష్మణ్, శంకర్, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

Views: 65

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఈ నెల 3న విద్యుత్ వినియోగదారుల దినోత్సవం ఈ నెల 3న విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
అందోల్ : పాపన్నపేట సబ్ డివిజన్ పరిధిలోని 4 మండలాలకు చెందిన ఈ నెల 3న విద్యుత్ వినియోగదారుల దినోత్సవం నిర్వహించనున్నట్లు ఏఈ నవాజ్ ప్రకటించారు.ఈ మేరకు...
చౌటకూర్‌లో ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ విద్యకు శ్రీకారం
కోయిలకొండ మండలంలో దారుణం.. చింతల్ తాండాలో మహిళ హత్య! ‎
డాన్స్ మాస్టర్ శేఖర్‌ను పరామర్శించిన జర్నలిస్టులు
కుక్కలు అడ్డురావడంతో అదుపుతప్పిన బైక్.. యువకుడికి తీవ్ర గాయాలు
మృతుని కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు
పాలెం వెంకటేశ్వర స్వామి ఆలయ భూములకు డిజిటల్ సర్వే