భక్తిశ్రద్ధలతో కార్యసిద్ధి ఆంజనేయస్వామి వార్షికోత్సవం

పాల్గొన్న మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి , ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదానం , పురోహితులు నందబాల శర్మకు ఘన సన్మానం

భక్తిశ్రద్ధలతో కార్యసిద్ధి ఆంజనేయస్వామి వార్షికోత్సవం

సిద్దిపేట జిల్లా/గజ్వేల్ :  సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని పాండవుల చెరువు కట్టపై వెలసిన శ్రీ కార్యసిద్ధి ఆంజనేయస్వామి దేవాలయ మూడవ వార్షికోత్సవ వేడుకలు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఎన్.సి. రాజమౌళి హాజరై, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం గజ్వేల్ పట్టణ ప్రముఖ పురోహితులు శ్రీ నందబాల శర్మ జన్మదినం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో వారిని శాలువాతో ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ చైర్మన్ ఎన్.సి. రాజమౌళి మాట్లాడుతూ "శ్రీ కార్యసిద్ధి ఆంజనేయస్వామి ఆలయం పునర్నిర్మాణం చేసుకొని మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వార్షికోత్సవాలు నిర్వహించడం చాలా సంతోషకరం. ఆంజనేయ స్వామివారి దివ్య అనుగ్రహంతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో విలసిల్లాలి" అని ఆకాంక్షించారు. అంతేకాకుండా, ఆలయ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ఆలయ కమిటీ సభ్యులను ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు. వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఆలయంలో నిర్వహించిన హోమం, స్వామివారికి విశేష అభిషేకం మరియు భక్తులకు అన్నదాన కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఆలయ అధ్యక్షులు గుంటుకు బిక్షపతి, ప్రధాన కార్యదర్శి జనార్దన్ రెడ్డి, కోశాధికారి దూబకుంట రుక్మయ్య, ఉపాధ్యక్షులు జంగం వెంకట్ గౌడ్, గంగిశెట్టి రాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీ గంగిశెట్టి కృష్ణ, కార్యదర్శులు, కమిటీ సభ్యులు, మాజీ అధ్యక్షులు మామిడి రాములు, నాయకులు దుర్గాప్రసాద్, బొగ్గుల సురేష్, ఎర్రం శ్రీనివాస్, దుర్గం స్వామి, నాగరాజు నేత,ఆర్కే శ్రీనివాస్, వెంకటేష్, అయ్యప్ప గోషాల నిర్వాహకులు శ్రీనివాస్, వెంకట్ గౌడ్, రమేష్, ప్రశాంత్, సత్యనారాయణ, మల్లేశం, శ్రవణ్, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఈ నెల 3న విద్యుత్ వినియోగదారుల దినోత్సవం ఈ నెల 3న విద్యుత్ వినియోగదారుల దినోత్సవం
అందోల్ : పాపన్నపేట సబ్ డివిజన్ పరిధిలోని 4 మండలాలకు చెందిన ఈ నెల 3న విద్యుత్ వినియోగదారుల దినోత్సవం నిర్వహించనున్నట్లు ఏఈ నవాజ్ ప్రకటించారు.ఈ మేరకు...
చౌటకూర్‌లో ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ విద్యకు శ్రీకారం
కోయిలకొండ మండలంలో దారుణం.. చింతల్ తాండాలో మహిళ హత్య! ‎
డాన్స్ మాస్టర్ శేఖర్‌ను పరామర్శించిన జర్నలిస్టులు
కుక్కలు అడ్డురావడంతో అదుపుతప్పిన బైక్.. యువకుడికి తీవ్ర గాయాలు
మృతుని కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు
పాలెం వెంకటేశ్వర స్వామి ఆలయ భూములకు డిజిటల్ సర్వే