స్వామి వివేకానంద విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ
యువతకు ఆదర్శం స్వామి వివేకానంద - నోబుల్ యూత్ అధ్యక్షులు నరేష్ చారి
రేగోడ్ (మెదక్ ) : మండల కేంద్రమైన రేగోడులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో స్వామి వివేకానంద విగ్రహ ప్రతిష్టాపనలో భాగంగా ఆదివారం నోబుల్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. హై స్కూల్ - పోలీస్ స్టేషన్ చౌరస్తాలో ఏర్పాటు చేయాలని అనుకున్నారు. దానికి అనుగుణంగా గ్రామ పెద్దలతో చర్చించి రోడ్డు విస్తరణ పనులు పూర్తి కాగానే విగ్రహన్ని ఏర్పాటు చేసేందుకు వారంతా సానుకూలంగా స్పందించారాని యూత్ అధ్యక్షులు నరేష్ చారి తెలిపారు.ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ మాజీ చైర్మన్ శాంరావు కులకర్ణి, మాజీ కో ఆప్షన్ చోటు మియా, మాజీ ఎంపీటీసీలు మన్నే నరేందర్, గొల్ల నర్సింలు,మండల యువజన సంఘాల అధ్యక్షులు సిందోల్ నంద కుమార్,ఆధర్స్ కుమార్,జగదీష్,కాంగ్రెస్ పార్టీ నాయకులు రామ గౌడ్,చక్రపాణి,బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి సుంకే రమేష్, గ్రామ అధ్యక్షులు రాచోటి సుభాష్, సోషల్ మీడియా కన్వినర్ సంతోష్ రావు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


