అమరవీరుల స్ఫూర్తితో.. రక్తదానంతో ప్రాణదానం
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో రక్తదాన శిబిరం ఎస్పీ మహేష్ ఆధ్వర్యంలో కార్యక్రమం.. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లా : పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది, మీడియా ప్రతినిధులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడేందుకు రక్తదానం ఎంతగానో దోహదపడుతుందని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా రక్తదానానికి ముందుకు రావాలని కార్యక్రమ నిర్వాహకులు పిలుపునిచ్చారు. పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, సేవాభావంతో నిర్వహించిన ఈ కార్యక్రమం సమాజంలో రక్తదానంపై అవగాహన పెంపొందించేందుకు దోహదపడింది.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


