బీసీ-ఏ రిజర్వేషన్లలో ముదిరాజులను చేర్చడాన్ని వ్యతిరేకిస్తున్నాం.! గంగపుత్ర సంఘం.!
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని గంగపుత్ర సంఘం ముదిరాజ్ కులాన్ని బీసీడీ నుండి బీసీఏలోకి మార్చాలని ప్రతిపాదనను మహాదేవపూర్ మండలం గంగపుత్ర సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని సంఘము నాయకులు తెలిపారు. ఈరోజు మహాదేవపూర్ మండలంలోని తాసిల్దార్ కార్యాలయములో వినతి పత్రంను అందజేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలోని బీసీఏ గ్రూపులో 7 శాతం రిజర్వేషన్లు గంగపుత్ర,రజక, నాయి బ్రాహ్మణ,వడ్డెర,మేదరి బుడుగ జంగం తో సహా 54 అత్యంత వెనుకబడిన కులాలు ఉన్నాయి. 40 లక్షల జనాభా కలిగిన ముదిరాజ్ కులాన్ని ఈ 7 శాతం లో కలిపితే మా బతుకులు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు.బిసీ ఏ లోని 54 కులాల పిల్లలు విద్య, ఉద్యోగ అవకాశాలను దెబ్బతింటాయని కావున ప్రభుత్వం ఈ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో బీసీఏ లోని 54 కులాలను కలిసి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలోని మహదేవపూర్ గ్రామ అధ్యక్షులు నాగుల ధర్మయ్య, ఉపాధ్యక్షులు ముద్రగడ శివరాం, కాలేశ్వరం గ్రామ అధ్యక్షులు గోర దేవయ్య,ఉపాధ్యక్షులు తూనూరి శ్రీకాంత్, బెంగుళూరు అధ్యక్షులు కాపరబోయిన మహేష్ ఉపాధ్యక్షులు కాపరబోయిన మధు తదితరులు గంగపుత్రులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


