అంతర్రాష్ట్ర సైబర్ నేరగాడి అరెస్ట్ ...... ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్‌.

వాట్సాప్ లింకుల ద్వారా అకౌంట్స్, క్రెడిట్ కార్డుల నుంచి రూ.4.20 లక్షలు కాజేసిన నిందితుడు.

అంతర్రాష్ట్ర సైబర్ నేరగాడి అరెస్ట్ ...... ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్‌.

సాంకేతిక ఆధారాలతో గుజరాత్‌లో నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసిన బేల పోలీసులు

అమ్మాయిల వలపు  సేవల పేరుతో నకిలీ లింకులు పంపుతూ దేశవ్యాప్తంగా సైబర్ మోసాలు

దేశవ్యాప్తంగా 220 ఫిర్యాదులు, తెలంగాణ లో 20 ఫిర్యాదులు.

మోసపోయిన డబ్బులలో కోర్టు ద్వారా బాధితులకి తిరిగి 2 లక్షల రూపాయలు అందజేత.

మూడు మొబైల్ ఫోన్స్, లాప్టాప్, ఐపాడ్ స్వాధీనం.

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ 

ఆదిలాబాద్ జిల్లా బేల పోలీస్ స్టేషన్ పరిధిలోని సాంగిడి గ్రామానికి చెందిన ఒక బాధితుడిని వాట్సాప్ ద్వారా నకిలీ లింక్ పంపించి, అతని బ్యాంకు ఖాతాలు, క్రెడిట్ కార్డుల నుంచి మొత్తం రూ.4,20,210 కాజేసిన అంతర్రాష్ట్ర సైబర్ నేరగాడిని సాంకేతిక ఆధారాలతో గుర్తించి అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు.
సోమవారం పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ కేసు వివరాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ...
ఆదిలాబాద్ జిల్లా బేల పోలీస్ స్టేషన్ పరిధిలోని సాంగిడి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి వాట్సాప్‌కు గుర్తుతెలియని నంబర్ నుంచి royalescort.com అనే లింక్ వచ్చింది. ఆ లింక్‌ను ఓపెన్ చేయగా ఫోన్‌పే ద్వారా రూ.2,200 చెల్లించాలనే విధంగా స్క్రీన్ కనిపించడంతో, అది నిజమని నమ్మిన బాధితుడు డబ్బులు చెల్లించాడు. అనంతరం అతని అనుమతి లేకుండానే అతని క్రెడిట్ కార్డులకు సంబంధించిన ఖాతాల నుంచి మొత్తం 16 లావాదేవీల ద్వారా రూ.4,20,210 డెబిట్ అయ్యాయి.
సైబర్ క్రైమ్ ఫిర్యాదు నమోదైన వెంటనే జిల్లా పోలీస్ శాఖ కార్యచరణ ప్రారంభించి రెండు లక్షల రూపాయలను ఖాతాలలో నిర్బంధించి తిరిగి బాధితునికి అందజేసి ప్రక్రియను పూర్తి చేసినట్లు తెలిపారు.
దీనిపై బాధితుడు ఫిర్యాదు చేయడంతో బేల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, సాంకేతిక ఆధారాలు, మొబైల్ నంబర్లు, ఆన్‌లైన్ లావాదేవీల వివరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన దినేష్ పటేల్ (23) అనే నిందితుడిని గుర్తించి గుజరాత్‌లో అదుపులోకి తీసుకున్నారు. నిందితునిపై దేశవ్యాప్తంగా 220 ఫిర్యాదులు నమోదు అయినట్లు తెలంగాణలో 20 ఫిర్యాదులు నమోదు అయినట్లు తెలిపారు.
 నిందితుడి వివరాలు: 
దినేష్ పటేల్ (23), s/o గంగారం పటేల్, పటేల్ మొహల్లా, దగర్ గ్రామం, ఉదయ్‌పూర్ జిల్లా, రాజస్థాన్ రాష్ట్రం.
నిందితుడు మోసాలకు పాల్పడిన విధానం:
నిందితుడు ఇతరుల గుర్తింపు పత్రాలను ఉపయోగించి సిమ్ కార్డులు సేకరించి, నకిలీ కాల్ గర్ల్ లేదా అమ్మాయిల వలపు సేవలు సర్వీసుల వెబ్‌సైట్ లింకులను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రచారం చేసేవాడు. ఆ లింకులను నమ్మి సంప్రదించిన బాధితులతో టెలిగ్రామ్, వాట్సాప్ ద్వారా మాట్లాడి, వివిధ రకాల సేవలు అందిస్తామని నమ్మించేవాడు.
బాధితులు పంపిన డబ్బులను మ్యూల్ బ్యాంకు ఖాతాల ద్వారా మళ్లించడం, క్రెడిట్ కార్డుల ద్వారా డబ్బులు చెల్లించిన సందర్భాల్లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ వేదికల నుంచి గిఫ్ట్ కార్డులు కొనుగోలు చేసి వాటి ద్వారా వస్తువులు పొందడం చేసేవాడు. అయితే బాధితులకు ఎలాంటి సేవలు అందించకుండా మోసాలకు పాల్పడేవాడు.
ఈ విధంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురిని మోసం చేసినట్లు విచారణలో వెల్లడైంది. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ, వనస్థలిపురం, నార్సింగి పోలీస్ స్టేషన్ల పరిధుల్లోనూ ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది.
నిందితుడి నుంచి సైబర్ నేరాలకు ఉపయోగించిన మూడు మొబైల్ ఫోన్లు, ఒక మినీ ఐప్యాడ్, ఒక హెచ్‌పీ ల్యాప్‌టాప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని బాధితుల నుంచి కాజేసిన డబ్బులతో కొనుగోలు చేసినట్లు నిందితుడు తెలిపాడు. స్వాధీనం చేసుకున్న పరికరాల ఆధారంగా మరిన్ని సైబర్ నేరాలకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తున్నారు.
ప్రజలకు జిల్లా ఎస్పీ సూచనలు:
* గుర్తుతెలియని వ్యక్తులు పంపే వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ లింకులను ఓపెన్ చేయవద్దు.
* ఎస్కార్ట్ సర్వీసులు,కాల్ గర్ల్స్, అమ్మాయిల వలపు సేవలు అంటూ ఆన్‌లైన్ సేవల పేరుతో ముందస్తు చెల్లింపులు కోరేవారిని నమ్మవద్దు.
* బ్యాంకు ఖాతాలు, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల వివరాలు, ఓటీపీలు ఎవరికీ తెలియజేయవద్దు.
* అనుమానాస్పద లావాదేవీలు జరిగిన వెంటనే బ్యాంకును సంప్రదించి, సైబర్ ఆర్థిక మోసాల హెల్ప్‌లైన్ నంబర్ 1930కు ఫిర్యాదు చేయాలి. అలాగే www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేయాలి.
సైబర్ నేరగాళ్లు ఉపయోగించే కొత్త పద్ధతుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యాశకు గురికాకుండా ఆన్‌లైన్ లావాదేవీలు నిర్వహించాలని జిల్లా ఎస్పీ సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సైబర్ నేరాల నియంత్రణకు జిల్లా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.
ఈ మీడియా సమావేశంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, జైనథ్ సీఐ జి. శ్రావణ్ కుమార్, బేల ఎస్ఐ మధుకృష్ణ, సైబర్ క్రైమ్ ఆర్ఎస్ఐ గోపికృష్ణ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పాలెం శాఖలో ఏబీవీపీ నూతన కమిటీ ఎన్నిక పాలెం శాఖలో ఏబీవీపీ నూతన కమిటీ ఎన్నిక
పాలెం(నాగర్ కర్నూల్) : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) పాలెం శాఖ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. జిల్లా కన్వీనర్ శాంతన్ ఆధ్వర్యంలో శ్రీ...
అర్షణపల్లి శివారులో భూముల రీ-సర్వే రైతులు సహకరించాలి.. భూ వివరాల నమోదును సక్రమంగా పరిశీలించాలి.
దండుపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
పెద్దగొట్టిముక్కలలో విద్యార్థులకు షూస్ పంపిణీ
అంబర్‌పేట మహంకాళి ఆలయంలో వనదుర్గ మహా రుద్ర యాగం, వరుణ యాగం.
జీడికల్‌లో పట్టభద్రుల ఓటరు నమోదుపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి
విద్యార్థులకు అల్పాహారం