ప్రజావాణికి 8 ఫిర్యాదులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల చర్యలు!
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పటాన్‌చెరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 8 దరఖాస్తులను స్వీకరించినట్లు ఎంపీడీవో యాదగిరి తెలిపారు.
ఈ సందర్భంగా ఇస్నాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి 3 దరఖాస్తులు, రెవెన్యూ శాఖకు సంబంధించి 2 దరఖాస్తులు, ఇంద్రేశం మున్సిపాలిటీకి ఒక దరఖాస్తు, ఇరిగేషన్ శాఖకు ఒక దరఖాస్తు, పంచాయతీరాజ్ శాఖకు ఒక దరఖాస్తు అందినట్లు వెల్లడించారు.
ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం అందించిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు పంపించి, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ప్రజావాణి ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంఈఓ నాగేశ్వరరావు, ఇంద్రేశం మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి, ఇస్నాపూర్ మున్సిపల్ కమిషనర్ వెంకట్ కిషన్ రావు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

