మండల నూతన తహశీల్దార్ గా మహమ్మద్ షఫీ.
తహశీల్దార్ గా అదనపు బాధ్యతలు స్వీకరించిన నాయబ్ తహశీల్దార్ మహమ్మద్ షఫీ.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో ఇన్చార్జి తహశీల్దార్ గా విధులు నిర్వహించిన ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ వనజ నాయక్ పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కు బదిలీపై వెళ్లారు.ఓదెల మండల నాయబ్ తహశీల్దార్ గా విధులు నిర్వహిస్తున్న మహమ్మద్ షఫీ తహశీల్దార్గా అదనపు బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది తహశీల్దార్ గా అదనపు బాధ్యతలు స్వీకరించిన మహమ్మద్ షఫీ పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్ఐ చంద్ర మోహన్,సీనియర్ అసిస్టెంట్ చంద్రకళ, ఎంపీఎస్ఓ మల్లేశం,జూనియర్ అసిస్టెంట్ సాయికృష్ణ తో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


