జీడికల్‌లో పట్టభద్రుల ఓటరు నమోదుపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి
గడపగడపకు వెళ్లి పట్టభద్రులకు అవగాహన – ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గెలుపే లక్ష్యంగా ప్రచారం
నల్లగొండ–వరంగల్–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇచ్చిన ఆదేశాల మేరకు జీడికల్ గ్రామంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.
గ్రామ సర్పంచ్ కొండబోయిన మమత సంపత్ ఆధ్వర్యంలో, గ్రామశాఖ అధ్యక్షులు దేవరాయ రాజు అధ్యక్షతన, ఎన్నికల కో-ఆర్డినేటర్ బస్వాగని అనిల్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామంలోని పట్టభద్రులను గడపగడపకు కలిసి ఓటరు నమోదుపై అవగాహన కల్పించారు.
అర్హులైన పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకొని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని నాయకులు పిలుపునిచ్చారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నల్లగొండ–వరంగల్–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గెలుపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఇన్‌చార్జులు కొండబోయిన సంపత్, యాదండ్ల నరేష్, గ్రామశాఖ ఉపాధ్యక్షులు మర్మాల బాబు, వార్డు సభ్యులు కొండబోయిన బాలమ్మ శ్రీశైలం, మూల వెంకటరెడ్డి, గ్రామశాఖ ప్రధాన కార్యదర్శి కొండబోయిన నాగరాజు, కార్యదర్శి నీల సత్యనారాయణ, కొండబోయిన దశరథ, లంబాడీ మత్స్యగిరి తదితరులు పాల్గొన్నారు.
పట్టభద్రుల ఓటరు నమోదు ప్రతి ఒక్కరి బాధ్యత – ప్రజాస్వామ్య బలోపేతానికి ప్రతి ఓటు కీలకం!
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


