కాళేశ్వరం ప్రభుత్వ పాఠశాలలో అల్పాహార పథకం ప్రారంభం.
కాళేశ్వరం: (జెడ్ పి హెచ్ ఎస్) కాళేశ్వరం ప్రభుత్వ పాఠశాలలో సోమవారం రోజు ఉదయం విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అల్పాహార పథకాన్ని ఘనంగా ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ శ్రీ వన్నెపు రెడ్డి మోహన్ రెడ్డి, ఉపసర్పంచ్ శ్రీ చెమ్మాల సుధీర్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ శ్రీమతి సుంకరి లక్ష్మి ముఖ్య అతిథులుగా పాల్గొని తమ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం, వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, చదువుపై ఏకాగ్రతను పెంపొందించడం, పాఠశాలకు హాజరును ప్రోత్సహించడం వంటి లక్ష్యాలతో ఈ అల్పాహార పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఈ సందర్భంగా సర్పంచ్ వెన్నపురెడ్డి మోహన్ రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థుల శారీరక, మానసిక అభివృద్ధితో పాటు విద్యా ప్రమాణాల మెరుగుదలకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ దొనికల రాజేందర్, ఉపాధ్యాయ బృందం, క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు ( సి ఆర్ పి ఎస్ ) పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


