కొండా లక్ష్మణ్ బాపూజీ కుమార్తెకు ఎమ్మెల్సీ సభ్యత్వం కల్పించాలి:మెదక్ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు మ్యాకల జయరాములు
తెలంగాణ జాతి పిత కొండా లక్ష్మణ్ బాపూజీ కుమార్తె డాక్టర్ పవిత్రవాణి కి ఎమ్మెల్సీ సభ్యత్వం కల్పించాలనీ మెదక్ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు మ్యాకల జయరాములు ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం రోజు ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా త్యాగం చేసిన మహనీయుడన్నారు. ఆయన నివాసమైన 'జల దృశ్యం' కేంద్రబిందువుగా నిలిచిందన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలోనూ బడుగు,బలహీన వర్గాల హక్కుల సాధనలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. డాక్టర్ పవిత్రవాణికి శాసన మండలి సభ్యత్వం కల్పించాలని కోరటం కేవలం ఆమె కొండా లక్ష్మణ్ బాపూజీ కుమార్తె అనే కారణంతోనే కాదని,తన విద్యార్హతలు,అనుభవం, సేవా దృక్పథం సమాజం పట్ల ఉన్న నిబద్ధత ద్వారా ఆమె పదవికి అర్హతలు కలిగి ఉన్నారన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యూనివర్సల్ ఫౌండేషన్ ద్వారా వందలాది పేద విద్యార్థులకు ఉన్నత విద్యలో శిక్షణ, ఆర్థిక సహాయం అందిస్తున్నారని ఆయన తెలిపారు. వీవర్ వెల్ఫేర్ ద్వారా పద్మశాలి విద్యార్థులకు ఉచిత వసతి,బోజన సౌకర్యాలు కల్పిస్తూ, చేనేత కార్మికులు కుటుంబాలకు చేయూత నిస్తున్నారని వెల్లడించారు.వైద్యురాలిగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ తమ సేవలు అందిస్తూన్నారనీ కొనియాడారు.ఈ నేపధ్యంలో ఆమెకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించటం ద్వారా తెలంగాణ ఉద్యమ వార సత్వానికి బీసీ సంక్షేమ,వైద్య,విద్యా రంగాలకు, చేనేతలకు సముచిత గౌరవం దక్కుతుందని ఆయన ఆశా భావం వ్యక్తం చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


