జాతీయ రహదారిపై పప్పు లారీ బోల్తా.. డ్రైవర్​కు స్వల్పగాయాలు

జాతీయ రహదారిపై పప్పు లారీ బోల్తా.. డ్రైవర్​కు స్వల్పగాయాలు

నిజామాబాద్ : జాతీయ రహదారిపై నిర్మాణ పనుల నేపథ్యంలో ఏర్పాటు చేసిన డైవర్షన్‌ వద్ద ప్రమాదాలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఇందల్వాయి మండలం చంద్రాయన్ పల్లి శివారులో మంగళవారం ఉదయం కందిపప్పు లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. తప్పిన పెనుప్రమాదం.. లారీబోల్తా పడిన ఘటనలో లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. మహబూబ్‌నగర్‌ నుంచి నాగ్​పూర్​కు వైపు వెళ్తున్న లారీ జాతీయ రహదారిపై బోల్తాపడటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లారీరోడ్డుపై పడిపోవడంతో సుమారు 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు చర్యలు చేపట్టారు. సుమారు 2గంటల పాటు శ్రమించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. జాతీయ రహదారి పనుల్లో భాగంగా అకస్మాత్తుగా డైవర్షన్‌ ఏర్పాటు చేయడం వల్లే ఈ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాహనదారులకు ముందస్తు సూచనలు, తగిన హెచ్చరిక బోర్డులు, భద్రతా ఏర్పాట్లు సమర్థంగా లేకపోవడం ప్రమాదాలకు కారణమవుతోందని ఆరోపిస్తున్నారు. వరుస ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు తగినచర్యలు తీసుకోవడం లేదని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డైవర్షన్‌ వద్ద అవసరమైన భద్రతాచర్యలు చేపట్టి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మఖ్తల్ లో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం మఖ్తల్ లో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం
నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో తెల్లవారుజామున నుండి జిల్లా ఎస్పీ వినీత్ ఆదేశాల మేరకు మక్తల్ సిఐ రామ్ లాల్ ఆధ్వర్యంలో...
భారత రాష్ట్ర సమితి నాయకుల ముందస్తు అరెస్ట్.
ఈవీఎం గోదాం తరలింపునకు ప్రత్యామ్నాయ వసతులను పరిశీలించిన జిల్లా కలెక్టర్
విద్యుత్ షాక్‌తో రైతు మృతి.. రంగాయపల్లిలో విషాదం
జాతీయ రహదారిపై పప్పు లారీ బోల్తా.. డ్రైవర్​కు స్వల్పగాయాలు
పంచాయతీ ట్రాక్టర్లకు భారమైన బీమా.. సవాల్​గా మారిన నిర్వహణ..
అమరవీరుల స్ఫూర్తితో.. రక్తదానంతో ప్రాణదానం