ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం తగదు - కలెక్టర్ హేమంత్ పాటిల్.

నాగర్ కర్నూల్ ప్రజావాణిలో 33 దరఖాస్తులు స్వీకరణ, 100% ఎఫ్‌ఆర్‌ఎస్‌కు ఆదేశం.

ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం తగదు - కలెక్టర్ హేమంత్ పాటిల్.

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ లో  సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ 33 దరఖాస్తులను స్వీకరించారు. ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులను స్వయంగా స్వీకరించిన కలెక్టర్, ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనల ప్రకారం జాప్యం లేకుండా పరిష్కరించాలని, పెండింగ్ ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. అనంతరం శాఖల వారీగా రోజువారీ అటెండెన్స్‌ను సమీక్షించిన కలెక్టర్, జిల్లాలో 100 శాతం ఎఫ్‌ఆర్‌ఎస్‌ విధానాన్ని పక్కాగా అమలు చేయాలని స్పష్టం చేశారు. అమలులో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. సిబ్బంది విధిగా ఎఫ్‌ఆర్‌ఎస్‌ పాటించాలని, విధుల్లో జవాబుదారీతనం, పారదర్శకతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి. చెన్నయ్య, దేవ సహాయం, డీఆర్ఓ పండు తదితరులు పాల్గొన్నారు.

Views: 54

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పాలెం శాఖలో ఏబీవీపీ నూతన కమిటీ ఎన్నిక పాలెం శాఖలో ఏబీవీపీ నూతన కమిటీ ఎన్నిక
పాలెం(నాగర్ కర్నూల్) : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) పాలెం శాఖ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. జిల్లా కన్వీనర్ శాంతన్ ఆధ్వర్యంలో శ్రీ...
అర్షణపల్లి శివారులో భూముల రీ-సర్వే రైతులు సహకరించాలి.. భూ వివరాల నమోదును సక్రమంగా పరిశీలించాలి.
దండుపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
పెద్దగొట్టిముక్కలలో విద్యార్థులకు షూస్ పంపిణీ
అంబర్‌పేట మహంకాళి ఆలయంలో వనదుర్గ మహా రుద్ర యాగం, వరుణ యాగం.
జీడికల్‌లో పట్టభద్రుల ఓటరు నమోదుపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి
విద్యార్థులకు అల్పాహారం