రోడ్డు ప్రమాదంలో గాయపడిన హుస్నాబాద్ 16వ వార్డు కౌన్సిలర్ వైద్యం కిరణ్ ప్రసాద్‌ను పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్.
రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ 16వ వార్డు కౌన్సిలర్ వైద్యం కిరణ్ ప్రసాద్‌ను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు.ఈ సందర్భంగా వైద్యం కిరణ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు.
హుస్నాబాద్‌లో ఇటీవల మృతి చెందిన అయిత కైలాసం కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్‌లో ఇటీవల మృతి చెందిన అయిత కైలాసం చిత్రపటానికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు. వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ సందర్భంగా అయిత కైలాసం కుటుంబ సభ్యులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధైర్యం చెప్పారు. వారి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


