పాలెం శాఖలో ఏబీవీపీ నూతన కమిటీ ఎన్నిక

పాలెం శాఖలో ఏబీవీపీ నూతన కమిటీ ఎన్నిక

పాలెం(నాగర్ కర్నూల్) : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) పాలెం శాఖ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. జిల్లా కన్వీనర్ శాంతన్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ కళాశాలలో ఈ కార్యక్రమం నిర్వహించారు. నూతన కమిటీలో బిజినపల్లి మండల కన్వీనర్‌గా ఏ.జీవన్ యాదవ్, నగర కార్యదర్శిగా జి.విష్ణు నాయుడు ఎన్నికయ్యారు. నగర సంయుక్త కార్యదర్శులుగా మోహన్, శివ, నగర ఎస్ఎఫ్డీ కన్వీనర్లుగా ఆకాష్, రమేష్, ఎస్ఎఫ్ఎస్ నగర కన్వీనర్లుగా చందు, శివ, నగర కళామంచ్ కన్వీనర్‌గా ఆంజనేయులు, నగర ఖేలో భారత్ కన్వీనర్లుగా జహంగీర్, లోకేష్, సోషల్ మీడియా కన్వీనర్లుగా నవీన్, శివకుమార్‌లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యారంగ సమస్యలపై ఏబీవీపీ నిరంతరం పోరాడుతుందని, విద్యార్థుల సమస్యలు ఉంటే దృష్టికి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Views: 11

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పాలెం శాఖలో ఏబీవీపీ నూతన కమిటీ ఎన్నిక పాలెం శాఖలో ఏబీవీపీ నూతన కమిటీ ఎన్నిక
పాలెం(నాగర్ కర్నూల్) : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) పాలెం శాఖ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. జిల్లా కన్వీనర్ శాంతన్ ఆధ్వర్యంలో శ్రీ...
అర్షణపల్లి శివారులో భూముల రీ-సర్వే రైతులు సహకరించాలి.. భూ వివరాల నమోదును సక్రమంగా పరిశీలించాలి.
దండుపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
పెద్దగొట్టిముక్కలలో విద్యార్థులకు షూస్ పంపిణీ
అంబర్‌పేట మహంకాళి ఆలయంలో వనదుర్గ మహా రుద్ర యాగం, వరుణ యాగం.
జీడికల్‌లో పట్టభద్రుల ఓటరు నమోదుపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి
విద్యార్థులకు అల్పాహారం