కాంగ్రెస్ పార్టీ బలోపేతం, జిల్లా అభివృద్ధికి నిధుల కేటాయింపుపై నామినేటెడ్ పదవుల గురించి టీపీసీసీ అధ్యక్షులు, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు ను కలిసిన డీసీసీ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు.
ప్రజాభవన్లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్,రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి లను కలిసిన ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా కాంగ్రెస్ నాయకులు
ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్, మాజీ ఎంపీ శ్రీ సోయం బాబూరావు , మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి , బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి శ్రీ ఆడే గజేందర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నరసయ్య , ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఈరోజు హైదరాబాద్లోని ప్రజాభవన్లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ , రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి తో సమీక్ష సమావేశం లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇరువురు ప్రముఖులను శాలువాలతో సత్కరించారు .ఈ భేటీలో ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, పార్టీ శ్రేణులను సమన్వయంతో ముందుకు నడిపించడం, రాబోయే రోజుల్లో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేయడం వంటి పలు కీలక అంశాలపై నాయకులు చర్చించారు. అదేవిధంగా త్వరలో ప్రకటించనున్న నామినేటెడ్ పదవుల నియామకాల విషయంలో పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న అర్హులైన నాయకులు, కార్యకర్తలకు సముచిత ప్రాధాన్యత కల్పించడం గురించి చర్చించడం జరిగింది తమ అభిప్రాయాలను వెల్లడించారు.
ఈ సమావేశంలో ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలను కూడా నాయకులు ప్రస్తావించారు. జిల్లాలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన ప్రభుత్వ సేవలు అందించడం, స్థానికంగా నెలకొన్న సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల వేగవంతం తదితర అంశాలపై చర్చిస్తూ, జిల్లాకు అవసరమైన నిధులు మంజూరు చేయడానికి తగిన సహకారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ని కోరినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ మాట్లాడుతూ, “ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేయడం మా ప్రధాన లక్ష్యం. పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న నాయకులు, కార్యకర్తలకు తగిన గుర్తింపు లభించేలా పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తున్నాం. రాబోయే నామినేటెడ్ పదవుల నియామకాలలో అర్హులైన వారికి అవకాశాలు కల్పించే అంశంపై చర్చించాం” అని పేర్కొన్నారు.
అలాగే, ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి సంబంధించి మాట్లాడుతూ, “జిల్లాలోని ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి కార్యక్రమాలకు మరిన్ని నిధులు తీసుకురావడానికి కృషి చేస్తున్నాం. రహదారులు, మౌలిక సదుపాయాలు, ప్రజా సంక్షేమం తదితర రంగాల్లో జిల్లా అభివృద్ధి చెందేలా ప్రభుత్వ పెద్దల సహకారంతో ముందుకు సాగుతాం. కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ద్వారా జిల్లాకు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడమే మా లక్ష్యం” అని డా. నరేష్ జాదవ్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో పార్టీని గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మరింత పటిష్టం చేస్తామని, పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

