చౌటకూర్‌లో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు.

సర్పంచ్ పార్కల రామ్ రెడ్డి ఆధ్వర్యంలో మూడు బోర్లకు రిపేర్లు, ఫ్లషింగ్ పనులు.

చౌటకూర్‌లో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు.

చౌటకూర్  :- సంగారెడ్డి జిల్లాలో చౌటకూర్ మండల కేంద్రంలో రాబోయే రోజుల్లో ఎల్‌నినో ప్రభావంతో తాగునీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో గ్రామ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా గ్రామ పంచాయతీ ముందస్తు చర్యలు చేపట్టింది.ఈ సందర్భంగా ఆదివారం గ్రామ సర్పంచ్ పార్కల రామ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక నిధుల ద్వారా గ్రామంలోని మూడు బోర్లకు ఫ్లషింగ్ (బోర్ల శుభ్రపరిచే) పనులు చేపట్టారు.ఈ సందర్భంగా సర్పంచ్ పార్కల రామ్ రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో ఎల్‌నినో ప్రభావం కారణంగా నీటి కొరత ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గ్రామంలో తాగునీటి సమస్య తలెత్తకుండా బోర్లను ముందుగానే శుభ్రపరిచి వినియోగానికి సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు.గ్రామ ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని మాజీ ఉపసర్పంచ్ రామా గౌడ్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు వర్కల రమేష్, మాజీ మండల అధ్యక్షుడు సార గోవర్ధన్ ముదిరాజ్, ప్రభాకర్ రెడ్డి, మల్లికార్జున్ గౌడ్,వార్డు సభ్యులు జైపాల్ రెడ్డి, చక్రపాణి ,కిట్టు, మల్లేశం, అశోక్, గోరేమియా, ఎల్లయ్య, రాజేశ్వర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Views: 42

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పాలెం శాఖలో ఏబీవీపీ నూతన కమిటీ ఎన్నిక పాలెం శాఖలో ఏబీవీపీ నూతన కమిటీ ఎన్నిక
పాలెం(నాగర్ కర్నూల్) : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) పాలెం శాఖ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. జిల్లా కన్వీనర్ శాంతన్ ఆధ్వర్యంలో శ్రీ...
అర్షణపల్లి శివారులో భూముల రీ-సర్వే రైతులు సహకరించాలి.. భూ వివరాల నమోదును సక్రమంగా పరిశీలించాలి.
దండుపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
పెద్దగొట్టిముక్కలలో విద్యార్థులకు షూస్ పంపిణీ
అంబర్‌పేట మహంకాళి ఆలయంలో వనదుర్గ మహా రుద్ర యాగం, వరుణ యాగం.
జీడికల్‌లో పట్టభద్రుల ఓటరు నమోదుపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి
విద్యార్థులకు అల్పాహారం